పంజాబ్ (Punjab) ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్, అకాలీ మాజీ నేత సుఖ్‌దేవ్ సింగ్ దిండాల పార్టీలతో పొత్తు పెట్టుకుని బీజేపీ పోటీ చేయవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) శనివారం తెలిపారు. ఆదివారం ఆయన హిందూస్థాన్ టైమ్స్ లీడర్ సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా పంజాబ్ ఎన్నికలపై ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము కెప్టెన్ (అమరీందర్ సింగ్) సాబ్‌తో పాటు (మాజీ అకాలీదళ్ నాయకుడు సుఖ్‌దేవ్ సింగ్) ధిండా సాబ్‌తో మాట్లాడుతున్నామని అన్నారు. తాము అంతా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. రైతుల నిరసనల విషయానికొస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narender Modi), నిరసనలను ముగించడానికి పెద్ద మనసు చూపి, వ్యవసాయ చట్టాలు మీకు ప్రయోజనం చేకూర్చడం లేదని రైతులు అనుకుంటే, వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇక పంజాబ్‌లో ఏ సమస్య మిగిలి ఉందని తాను అనుకోను అని అన్నారు. ఇక పంజాబ్‌లో ఎన్నికలు మెరిట్‌పైనే జరుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈమోదీ హయాంలో తీసుకొచ్చిన మార్పులు, చేసిన అభివృద్ధి గురించి ఈ సందర్భంగా వివరించారు. సర్జికల్ స్ట్రైక్స్ (Surgical Strikes), జమ్మూకాశ్మీర్ (Jammu nd Kashmir)లో ఆర్టికల్ 370 రద్దు (Article 377 abolition) ఇలా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు అమిత్ షా.
Omicran in India: దేశంలో నాలుగో ఒమిక్రాన్ కేసు నమోదు.. ఎక్కడంటే?
పంజాబ్ (Punjab)లో 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. తాజాగా కొత్త పార్టీ పెట్టిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాష్ట్రంలోని 117 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తానని.. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ (BJP)తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని గతంలో ఆయన చెప్పారు. తన కుటుంబ కంచుకోటగా భావించే పాటియాలా (Patiala) నుంచి 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
Afghanistan: ఆఫ్ఘన్‌లో సగం జనాభా ఆహార కొరతతో బాధపడే అవకాశం: పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి
మారిన రాజకీయ పరిస్థితులు
ప్రధాని మోదీ రైతు చట్టాలను (Farm Laws) ఉపసహరించుకోవడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్- బీజేపీ పొత్తు పెట్టుకోనున్నాయనే ఉహాగానాలు పెరిగాయి. ప్రస్తుతం అమిషా వ్యాఖ్యలతో పొత్తు కచ్చితంగా పెట్టుకుంటారని రాజకీయ విశ్లేషకులు అంచానా వేస్తున్నారు. అమరీందర్‌సింగ్ రాజీనామా సమయంలో పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ (navjoth singh siddu)పై విమర్శలు గుప్పించారు. పంజాబ్‌కు చెందిన పార్టీ ఎంపీలందరూ సిద్దూని వ్యతిరేకించినా పీసీసీ అధ్యక్షుడిగా మీరు నియమించారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Pakistan PM Imran khan), పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ భజ్వాను సిద్ధూ బహిరంగంగా ఆలింగనం (hug) చేసుకున్నారని గుర్తుచేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Assembly Election 2022, Bjp, Farm Laws, Modi, Punjab