Home /News /national /

PUNJAB ELECTIONS 2022 SONU SOOD SISTER MALVIKA JOINS CONGRESS IN PRESENCE OF CM CHANNI SIDHU CALLS IT GAME CHANGER MKS

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన Sonu Sood సోదరి మాల్విక -మొగ నుంచి పోటీ -Punjabలో గేమ్ ఛేంజర్!

పంజాబ్ సీఎం చన్నీ, మాల్వికా, సోనూ సూద్, సిద్దూ

పంజాబ్ సీఎం చన్నీ, మాల్వికా, సోనూ సూద్, సిద్దూ

సోనూ సూద్ కుటుంబం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరింది. సోనూ సూద్ సోదరి మాల్వికా సూద్ సచార్ సోమవారం నాడు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఫిబ్రవరి 14న జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాల్విక మొగ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు..

ఇంకా చదవండి ...
ప్రముఖ నటుడు, దాత, సామాజిక సేవకుడు సోనూ సూద్ కుటుంబం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరింది. సోనూ సూద్ సోదరి మాల్వికా సూద్ సచార్ సోమవారం నాడు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్వయంగా మొగాలోని సోనూ సూద్ నివాసానికి వెళ్లిమరీ మాల్వికను పార్టీలో చేర్చుకోవడం గమనార్హం. సోనూ సామాజిక సేవలో కీలక భూమిక పోషించిన మాల్విక కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని పంజాబ్ లో గేమ్ ఛేంజర్ గా అభివర్ణించారు పీసీసీ చీఫ్ సిద్ధూ. ఫిబ్రవరి 14న జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాల్విక మొగ జిల్లా నుంచే బరిలోకి దగడం ఖాయంగా కనిపిస్తోంది.

తన సోదరి రాజకీయ రంగప్రవేశంపై సోనూ సూద్ గతేడాది నవంబర్ లోనే ప్రకటన చేశారు. అయితే ఏ పార్టీలో చేరబోయేది మాత్రం అప్పుడు వెల్లడించలేదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో అనుబంధం, ఇటీవల పంజాబ్ లో ఆప్ బాగా విస్తరించిన నేపథ్యంలో సోనూ సోదరి మాల్వికా ఆమ్ ఆద్మీగా మారతారనే ప్రచారం జరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ ముఖ్యనేతలతోనూ సోనూ కుటుంబం టచ్ లో ఉంది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, వచ్చే వారం అభ్యర్థుల జాబితా ఖరారు కానుండటంతో మాల్విక్ కాంగ్రెస్ లోకి అధికారికంగా చేరిపోయారు.

lockdown: ఉద్యోగులెవరూ ఆఫీసులకు పోవద్దు.. రెస్టారెంట్లలో తినడం నిషేధం.. covid తాజా ఆంక్షలు



తన స్వస్థలమైన మోగా నుంచి ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు కూడా మాల్వికా సూద్ పేర్కొన్నారు. ఒక మహిళా నేత కోసం ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు స్వయంగా ఇంటికి వెళ్లారంటే ఆమెకున్న ప్రాధాన్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని, సామాజిక సేవలో ముందున్న మాల్వికా రాకతో కాంగ్రెస్ బలం పెరిగిందని, ఇది గేమ్ ఛేంజర్ గానూ అభివర్ణిస్తానని సిద్ధూ వ్యాఖ్యానించారు.

PM Modi security breach : సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.. ఉరి తీయండన్న punjab ఏజీ



మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగనుంది. ఎన్డీఏ నుంచి అకాలీదళ్ విడిపోవడంతో ఈసారి బీజేపీ దాదాపు ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీతో బీజేపీ పొత్తుపై పెద్దగా అంచనాల్లేవు. అటు అకాలీదళ్ సైతం చాలా ఏళ్ల తర్వాత సింగిల్ గా బరిలో నిలిచింది. ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇటీవల ఛండీగఢ్ స్థానిక ఎన్నికల్లోనూ ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆప్, కాంగ్రెస్ పార్టీలతో సుదీర్ఘ చర్చలు జరిపిన సోనూ సూద్ కుటుంబం చివరికి కాంగ్రెస్ వైపే మొగ్గుచూపింది.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Congress, Navjot Singh Sidhu, Punjab, Sonu Sood

తదుపరి వార్తలు