హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

‘జర్మనీలో పంజాబ్ పరువుతీసిన సీఎం భగవంత్ మాన్..’.. కీలక వ్యాఖ్యలు చేసిన అకాలీదళ్ నేతలు.. కారణం ఏంటంటే...

‘జర్మనీలో పంజాబ్ పరువుతీసిన సీఎం భగవంత్ మాన్..’.. కీలక వ్యాఖ్యలు చేసిన అకాలీదళ్ నేతలు.. కారణం ఏంటంటే...

సీఎం భగవంత్ మాన్ (ఫైల్)

సీఎం భగవంత్ మాన్ (ఫైల్)

Punjab:  పంజాబ్ సీఎం తాగి ఉండటం వలన జర్మనీలోని ఎయిర్ పోర్టులో అధికారులు విమానం ఎక్కనివ్వలేదని, శిరోమణి అకాలీదళ్ నేతలు ఆరోపించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Punjab, India

పంజాబ్ సీఎం భగవంత్ మాన్, తాగుబోతంటూ శిరోమణి అకాలీదళ్ నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తాగి ఉండటం వలన ఫ్రాంక్ ఫర్డ్ ఎయిర్ పోర్ట్ లో విమానం ఎక్కనీయలేదని, ఆరోపణలు గుప్పించారు. పంజాబీల పరువులను విదేశాల్లో తీశారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ క్రమంలో శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ ట్విటర్ వేదికగా సీఎం భగవంత్ మాన్ పై విరుచుకుపడ్డారు. ‘సీఎం భగవంత్ మాన్ కనీసం నడవలేని స్థితిలో లుఫ్తానా విమానం ఎక్కడానికి ప్రయత్నించారని, కానీ అధికారులు ఆయనను ఎక్కనీయలేదని ఆరోపించారు. ’దీంతోనే ఆయన జాతీయసమావేశానికి హజరు కాలేకపోయారంటూ మండిపడ్డారు.

ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పంజాబీలను అవమానపర్చే విధంగా మారిందన్నారు. అయితే.. దీనిపై ఆప్ నేతలు.. ఈ ఆరోపణలను ఖండించారు. ఇవన్ని నిరాధారమైన ఆరోపణలని కొట్టిపాడేశారు. సీఎం తన షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబరు 18న జర్మనీ నుంచి బయలు దేరి వచ్చారు. విమానం ఆలస్యం కారణంగా ఆయన 19 న ఢిల్లీలో దిగాల్సి వచ్చిందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి, చెత్త మరియు తప్పుడు ప్రచారమని ఆప్ నేత కాంగ్ అన్నారు.

ఇదిలా ఉండగా  కెప్టెన్ అమరీందర్ సింగ్ (80) (Captain amarinder singh) పంజాబ్ కు రెండు సార్లు ఆయన సీఎంగా ఉన్నారు.

ఈ క్రమంలో ఆయనను కాంగ్రెస్ నాయకత్వం ఆయనను తొలగించి చరణ్ జీత్ సింగ్ ఛన్నీని సీఎంగా చేసింది. దీంతో అప్పట్లో ఆయన తీవ్ర మనస్తాపం చెంది పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే సొంత పార్టీని స్థాపించారు. దీంతో ఆయన గత పంజాబ్ ఎన్నికలలో బీజేపీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోదిగారు. అయినప్పటికి ఆయన గెలవలేకపోయారు. దీంతో కొంత కాలంగా అమరీందర్ సింగ్ తన పార్టీని బీజేపీలోని విలీనం చేయబోతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. తాజాగా, అవి నిజమయ్యాయి. ఈ రోజు కెప్టెన్ అమరీందర్ సింగ్, జేపీనడ్డాతో భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ ను బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ కూడా బీజేపీలో చేరనున్నారు. "కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇటీవల వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత లండన్ నుండి తిరిగి వచ్చి గత వారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ప్రస్తుతం అమరీందర్ సింగ్ తన పార్టీని బీజేపీలో విలీనం చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bhagwant Mann, Drinking wine, Punjab, VIRAL NEWS

ఉత్తమ కథలు