పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఆయన అక్క సుమన్ తుర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా క్రూరమైన వ్యక్తి అని సుమన్ తుర్ విమర్శించారు. తన తల్లి వృద్ధాప్యంలో ఉన్న సమయంలో డబ్బు కోసం సిద్ధూ ఆమెను బయటకు వెళ్లగొట్టాడని ఆరోపించారు. సుమన్ తుర్ ప్రస్తుతం చండీగఢ్‌లో ఉన్నారు. 1986లో తమ తండ్రి మరణించిన తర్వాత నవజ్యోత్ సిద్ధూ తన తల్లితో పాటు తనను బయటకు వెళ్లగొట్టారని ఆరోపించారు. తమ తల్లి 1989లో రైల్వే స్టేషన్లో మరణించిందని తుర్ పేర్కొన్నారు. అప్పట్లో తాము చాలా క్లిష్టమైన పరిస్థితులను చవిచూశామని ఆమె వ్యాఖ్యానించారు. తన తల్లి నాలుగు నెలల పాటు ఆస్పత్రిలో ఉన్నారని తెలిపారు. తాను చేస్తున్న ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని సుమన్ తుర్ చెప్పారు.
ఆస్తి కోసమే సిద్ధూ తమతో సంబంధాలు తెంచుకున్నారని సుమన్ తుర్ ఆరోపించారు. తన తండ్రి పింఛనుతో పాటు ఇల్లు, భూమితో సహా ఆస్తులను తమ కోసం వదిలివెళ్లారని ఆమె తెలిపారు. నవ్‌జోత్ సింగ్ సిద్ధూ డబ్బు కోసం తల్లిని విడిచిపెట్టాడని ఆరోపించారు. సిద్ధూ నుండి తమకు ఎలాంటి డబ్బు అక్కర్లేదని అన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూను క్రూరమైన వ్యక్తిగా అభివర్ణించిన సుమన్ తుర్.. 1987లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధూ తన తల్లిదండ్రులను విడిచిపెట్టడం గురించి అబద్ధం చెప్పాడని ఆమె పేర్కొన్నారు. తన తల్లిదండ్రుల గురించి నవజ్యోత్ సింగ్ సిద్ధూ వాదించేది అబద్ధమని అన్నారు.
తన తల్లి తండ్రి తండ్రి నుండి విడిపోయిందని చెప్పడానికి సుమన్ తుర్ సిద్ధూ నుంచి ఆధారాలు డిమాండ్ చేశారు. తనకు, తన తండ్రికి మధ్య న్యాయపరమైన విభజన ఉందని నవజ్యోత్ సిద్ధూ పేర్కొన్న తర్వాత తన తల్లి కోర్టును ఆశ్రయించిందని సుమన్ తుర్ చెప్పారు. జనవరి 20న నవజ్యోత్ సిద్ధూని కలవడానికి తాను వెళ్లానని, అయితే అతను తనను కలవడానికి నిరాకరించాడని.. తలుపు తీయలేదని సుమన్ తుర్ పేర్కొంది.
తన తల్లికి న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ప్రస్తుతం తాను 70 ఏళ్ల వయస్సులో ఉన్నానని, తమ కుటుంబం గురించి ఈ విషయాలను బహిర్గతం చేయడం నిజంగా కఠినమైనదని ఆమె తెలిపారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నవజ్యోత్ సిద్ధూ ముఖ్యమంత్రి ఆశావహుల జాబితాలో ఉన్నారు. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.