PUNJAB CM CHARANJIT SINGH CHANNI ANNOUNCED LOAN WAIVERS FOR FARMERS AND INCENTIVES FOR FILM AND MUSIC INDUSTRY PRV
Loan waiver: రైతులు, చలనచిత్ర, సంగీత పరిశ్రమలకు ముఖ్యమంత్రి వరాలు.. 10 రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు....
ప్రతీకాత్మక చిత్రం
ఎన్నికల వేళ ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపిస్తున్నరు. ఇటీవల ట్రాక్టర్ ర్యాలీలో అరెస్టయిన రైతులకు రూ.2 లక్షలు ప్రకటించారు. ఇపుడు మరో అడుగు ముందకేసి రైతులకు రుణమాఫీ, చలనచిత్ర పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు.
గత కొద్దిరోజులుగా దేశంలో పంజాబ్ (Punjab) పేరు మారుమోగుతోంది. వినూత్న రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడమే దీనికి కారణం. పంజాబ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నవజ్యోత్ సింగ్ సిద్దూ (Navjot Singh Sidhu) పీసీసీ పగ్గాలు చేపట్టడం. ఏళ్లుగా పార్టీకి సేవలందించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేయడం, ఎవరూ ఊహించని విధంగా దళితుడైన చరణ్‌సింగ్ చన్నీని పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కించడం నెలల వ్యవధిలోనే జరిగిపోయాయి. ఇక ఆ తర్వాత అమరీందర్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ పెట్టడం, బీజేపీతో కలవడం జరిగిపోయాయి. అయితే మరికొద్ది నెలల్లో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections in Punjab) జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా పార్టీలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో అరెస్టయిన రైతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఇపుడురైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని (loan waiver up to Rs 2 lakh), మరో 10 రోజుల్లో భూముల తనఖాలను కూడా మాఫీ చేస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ (Punjab Chief Minister Charanjit Singh Channi) శుక్రవారం ప్రకటించారు.
భూమి తనఖా కూడా మాఫీ..
ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘రెండు లక్షల రూపాయల వరకు రుణాలు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. భూమి తనఖా కూడా మాఫీ చేయబడుతుంది. ఆ మొత్తాన్ని వచ్చే 10-15 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. రైతుల కోసం రూ. 2,000 కోట్లు కేటాయించాం’’ అని చరణ్‌జిత్ సింగ్ చన్నీ ((Punjab Chief Minister Charanjit Singh Channy)) శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు.
"భూమిలేని కూలీలకు కూడా రుణమాఫీ(Loan waiver) ఉంటుంది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారి రుణాలు (loan) కూడా మాఫీ చేయబడతాయి" అని చరణ్‌జిత్ సింగ్ చన్నీ చెప్పారు, రైతుల మిగిలిన రుణాలన్నింటినీ మాఫీ చేసే అంశాన్ని కూడా రాష్ట్ర మంత్రివర్గం (Cabinet of State) పరిశీలిస్తోందని సీఎం చెప్పారు.
Congress Govt. has already waived off loans of 5.63 lakh such farmers to the tune of Rs.4610 crore. Out of these, 1.34 lakh small farmers got relief of Rs. 980 crore while 4.29 lakh marginal farmers were benefitted of loan waiver of Rs. 3630 crore. pic.twitter.com/D3Z3x4rqdM
అంతేకాకుండా చలన చిత్ర పరిశ్రమ (The film industry)కు కూడా సీఎం చరణ్‌సింగ్ వరాలు ప్రకటించబోతున్నారు. పంజాబీ చలనచిత్ర మరియు సంగీత పరిశ్రమ (Punjabi films and music Industry)ను ప్రోత్సహించడానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా సీఎం పేర్కొన్నారు.
"పంజాబీ సినిమాలు, సంగీతం (Punjabi movies, music) ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కాబట్టి పరిశ్రమను ప్రోత్సహించడానికి, ఒక చలనచిత్ర, అభివృద్ధి మండలి ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. సినీ నటులు, ప్రమోటర్లు , దర్శకులను ఇది ప్రోత్సహిస్తుందని " చరణ్‌జిత్ సింగ్ చన్నీ చెప్పారు. అంతేకాకుండా పంజాబ్ ప్రభుత్వం హిందూ పురాణాలు, గ్రంథాలపై దృష్టి సారించింది. "పంజాబ్ ప్రభుత్వం భగవత్గీత మరియు రామాయణ (Bhagwat Gita and Ramayana) అధ్యయనాల కోసం ఒక అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది" అని చరణ్‌జిత్ సింగ్ చన్నీ చెప్పారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.