Home /News /national /

PUNJAB CM CHANNI WRITES TO EC TO POSTPONE FEB 14 ASSEMBLY POLLS BY 6 DAYS AMID GURU RAVIDAS BIRTH ANNIVERSARY MKS

Punjab Elections 2022: పంజాబ్ ఎన్నికలు వాయిదా.. ఈసీకి సీఎం లేఖ.. దళితుల సెంటిమెంట్

పంజాబ్ లో ఎన్నికల వాయిదాకు ఈసీకి సీఎం వినతి

పంజాబ్ లో ఎన్నికల వాయిదాకు ఈసీకి సీఎం వినతి

కాంగ్రెస్ పాలిత పంజాబ్ లో మాత్రం ఎన్నికల వాయిదాకు డిమాండ్ వెల్లువెత్తుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ స్వయంగా భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్రకు శనివారం రాత్రి కీలక లేఖ రాశారు. పంజాబ్ లో 32 శాతంగా ఉన్న దళితుల సెంటిమెంట్ లో ముడిపడిన అంశాన్ని ప్రస్తావిస్తూ..

ఇంకా చదవండి ...
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు నిర్దేశంగా ఉండొచ్చని భావిస్తోన్న ప్రస్తుత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య అంశం తెరపైకొచ్చింది. ఈసీ పకడ్బందీ షెడ్యూల్ కూడా ప్రకటించిన ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో బీజేపీ ప్రభుత్వాలే ఉండగా, కాంగ్రెస్ పాలిత పంజాబ్ లో మాత్రం ఎన్నికల వాయిదాకు డిమాండ్ వెల్లువెత్తుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ స్వయంగా భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్రకు శనివారం రాత్రి కీలక లేఖ రాశారు. పంజాబ్ లో 32 శాతంగా ఉన్న దళితుల సెంటిమెంట్ లో ముడిపడిన అంశాన్ని ప్రస్తావిస్తూ పోలింగ్ తేదీని ఫిబ్రవరి 14 నుంచి ఆరు రోజుల తర్వాతకు వాయిదా వేయాల్సిందిగా సీఎం చన్నీ అభ్యర్థించారు.

పంజాబ్‌లో 32 శాతం మంది దళితులే అన్న సంగతి తెలిసిందే. పంజాబ్ సహా ఉత్తరాదిలోని దళితులు అమితంగా ఆరాధించే గురు రవిదాస్ జయంతి ఫిబ్రవరి 16న జరుపుతారు. రవిదాస్ జయంతి పంజాబ్ లోని దళితులు లక్షల సంఖ్యలో ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్‌కు వెళ్లి అక్కడ సంత్ పుట్టిన ప్రదేశంలో ప్రార్థనలు చేస్తారు. రవిదాస్ జయంతి సందర్భంగా పంజాబ్ దళితులు యూపీకి వెళ్లే ప్రక్రియ ఫిబ్రవరి 10 నుంచి 16వ తేదీ మధ్య ఉంటుంది.

రవిదాస్ జయంతిలో పాల్గొనే క్రమంలో పంజాబ్ దళితులు దాదాపు 20 నుంచి 30 లక్షల మంది యూపీలో పర్యటించే అవకాశం ఉందని, ఫిబ్రవరి 14న పంజాబ్ లో పోలింగ్ ఉన్నందున వీరంతా తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని, కాబట్టి అసెంబ్లీ ఎన్నికల తేదీని ఆరు రోజులపాటు.. అంటే రవిదాస్ జయంతి ఉత్సవాల తర్వాతి వరకు వాయిదా వేయాలని ఈసీని పంజాబ్ సీఎం కోరారు. ఈ అభ్యర్థనపై ఈసీ స్పందించాల్సి ఉంది.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వచ్చే నెల 14వ తేదీన జరగనున్నాయి. సింగిల్ ఫేజ్‌లో ఈ ఎన్నికలు ముగుస్తాయి. మార్చి 10వ తేదీన ఫలితాలు వస్తాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ శనివారం 86 మందితో తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ చాంకౌర్ సాహిబ్ నుంచి పోటీ చేయనున్నారు. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూ.. తూర్పు అమృత్‌సర్ నుంచి పోటీ చేస్తారు. డేరా బాబా నానక్ నియోజవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ సింగ్ రంథావా, గిడ్డెర్‌బహ నుంచి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాజా అమరీందర్ పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. ప్రముఖ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్‌ మోగా నియోజకవర్గం నుంచి బ‌రిలోకి దించుతోంది కాంగ్రెస్‌.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022

తదుపరి వార్తలు