హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Punjab cm : ఆ రైతులకు రెండు లక్షల పరిహారం.. ముఖ్యమంత్రి నిర్ణయంతో మారనున్న రైతు ఉద్యమం

Punjab cm : ఆ రైతులకు రెండు లక్షల పరిహారం.. ముఖ్యమంత్రి నిర్ణయంతో మారనున్న రైతు ఉద్యమం

ఢిల్లీ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నిీ

ఢిల్లీ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నిీ

Punjab : పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత వివాదాన్ని రాజేసేదిగా తాయరు కానుంది.

  రైతు ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యమంలో పాల్గొన్న రైతులకు నజరానా ప్రకటించింది. రైతు ఉద్యమంలో భాగంగా ఢిల్లీ ఎర్రకోటపై జెండాను ఎగరవేశారు. దీంతో ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గోన్న రైతులకు రెండు లక్షల రూపాయల పరిహారాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి తెలిపారు.

  కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు గతేడాది నవంబరు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. వారి ఆందోళనల్లో భాగంగా... ఈ ఏడాది జనవరి 26 న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు అనుమతించిన రూట్లలో కాకుండా కొందరు ఆందోళనకారులు మరో మార్గంలో వెళ్లి చారిత్రక ఎర్రకోటను ముట్టడించి కోటపై జెండాను ఎగురవేశారు.అడ్డుకున్న పోలీసులతోనూ ఘర్షణలకు దిగారు.దీంతో అక్కడ హింసాత్మక ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి 83 మంది రైతులను అరెస్టు చేశారు.అయితే ఆ ట్రాక్టర్ ర్యాలీలో పాల్గోని ఎర్రకోట వైపు దూసుకు వెళ్లిన రైతులకు పంజాబ్ ప్రభుత్వం మద్దతుగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు పెట్టి అరెస్ట్ కాబడిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.

   ఇది చదవండి : మిస్టరీ వీడింది.. దారుణం వెలుగు చూసింది.. బిక్షాటన.. అక్రమ సంబంధమే కారణం..


  ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ ట్విట్టర్ వేదికగా సమాచారాన్ని ఇచ్చారు. '' మూడు నల్ల సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తోన్న రైతు ఉద్యమానికి మా ప్రభుత్వం మద్దతు ఉంటుందని మరోసారి పునరుద్ఘాటిస్తున్నా. జనవరి 26 న ఢిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టినందుకు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన 83 మంది రైతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని అందించాలని నిర్ణయించాం '' అని పేర్కొన్నారు.

  ఇది చదవండి : ఫేస్‌బుక్‌లో అందమైన ఫోటో.. టెమ్ట్ అయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కట్ చేస్తే..


  కాగా ఇప్పటికే పంజాబ్, హార్యానా రైతులు పెద్ద ఎత్తున కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు చేస్తుండగా, రాష్ట్రం ప్రకటించిన పరిహారంతో రైతుల్లో మరింత ఉత్సహాన్ని నింపి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయో అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కేంద్రంతో పాటు పంజాబ్ మధ్య వివాదాలు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Delhi, Farmers Protest, Punjab news

  ఉత్తమ కథలు