• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • PUNJAB CALLER ABUSES PM MODI MOTHER ON BBC LIVE SHOW IN UK ANCHOR ISSUED AN APOLOGY FULL DETAILS HERE HSN

ప్రధాని మోదీ తల్లిపై లైవ్ లో అసభ్యకర కామెంట్స్.. నిషేధించాలంటూ బీబీసీపై మండి పడుతున్న నెటిజన్లు

ప్రధాని మోదీ తల్లిపై లైవ్ లో అసభ్యకర కామెంట్స్.. నిషేధించాలంటూ బీబీసీపై మండి పడుతున్న నెటిజన్లు

ప్రధాని మోదీ ( File)

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లిపై  అసభ్యకర వ్యాఖ్యలకు దిగాడో వ్యక్తి.  రాయలేని పదాలతో ప్రధాని మోదీపై అక్కసును వెళ్లగక్కాడతను. ప్రఖ్యాత బీబీసీ ఆలిండియా రేడియో దీనికి వేదిక అయింది.

  • Share this:
    భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లిపై  అసభ్యకర వ్యాఖ్యలకు దిగాడో వ్యక్తి.  రాయలేని పదాలతో ప్రధాని మోదీపై అక్కసును వెళ్లగక్కాడతను. ప్రఖ్యాత బీబీసీ ఆలిండియా రేడియో దీనికి వేదిక అయింది. అయితే అతడి పదాలను యథాతథంగా ప్రేక్షకుల్లోకి వదలడంతో ఇప్పుడు అది కాస్తా నెట్టింట కొత్త వివాదాన్ని క్రియేట్ చేసింది. భారత్ లో బీబీసీని బ్యాన్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూకేలో సిక్కులు, భారతీయులపై జరుగుతున్న దాడులు, జాత్యాహంకారం అనే అంశంపై బీబీసీ ఆసియన్ నెట్ వర్క్ లో మార్చి 1వ తారీఖున ఓ బిగ్ డిబేట్ జరిగింది. దాదాపు ఒక గంట 53 నిమిషాల పాటు జరిగిన ఈ డిబేట్ లో అంతర్జాతీయ దేశాల నుంచి పలువురు వ్యక్తులు ఫోన్ కాల్ ద్వారా పాల్గొన్నారు.

    భారత్ నుంచి పంజాబ్ కు చెందిన ఓ వ్యక్తి ఈ లైవ్ డిబేట్ లో పాల్గొన్నాడు. ప్రియారాయ్ అనే యాంకర్ ఈ డిబేట్ ను నిర్వహించారు. అయితే ఈ చర్చ కాస్తా భారత్ లో జరుగుతున్న రైతుల నిరసనల వైపు మళ్లింది. పంజాబ్ కు చెందిన వ్యక్తి మాట్లాడుతూ చర్చను తప్పుదోవ పట్టించాడు. ప్రధాని మోదీపై తనకు ఉన్న అక్కసును వెళ్లగక్కాడు. అదే సమయంలో ప్రధాని మోదీ తల్లిపై అసభ్యకరంగా నీచమైన వ్యాఖ్యలను చేశాడు. రాయలేని పదాలను వాడి దూషణలకు దిగాడు. అయితే బీబీసీ ఈ మాటలను డిలీట్ చేయడం వంటివి చేయకుండా నేరుగా ప్రేక్షకుల్లోకి వదిలింది. దీంతో అతడి మాటలు వెలుగులోకి వచ్చాయి.


    ఇది కూడా చదవండి: హైదరాబాద్ టెకీకి షాకింగ్ అనుభవం.. క్రెడిట్ కార్డు ఫ్రీగా ఇస్తున్నాం సర్.. అంటూ షాపింగ్ మాల్ బయట ఓ వ్యక్తి చెప్పడంతో..

    అది కాస్తా రచ్చ రచ్చ అయింది. నెట్టింట బీబీసీపై ఆగ్రహోద్యమం మొదలయింది. బీబీసీని నిషేధించాలంటూ, యాజమాన్యం క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దూషణలకు దిగిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఓ దేశ ప్రధాని తల్లిని దూషిస్తే, వాటిపై విచారణ వ్యక్తం చేయకపోవడం దారుణమని పోస్టులు పెడుతున్నారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఘటనను ఖండిస్తున్నారు. కాగా, నెట్టింట వెల్లువెత్తుతున్న విమర్శలతో బీబీసీ ఆ ప్రోగ్రాంను ఎడిట్ చేసింది. ఒక గంట 32 నిమిషాల పాటు ఆ ప్రోగ్రాంను ఎడిట్ చేసి, అభ్యంతర కామెంట్స్ ను తొలగించింది. అంతే కాకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన యాంకర్ క్షమాపణ కూడా చెప్పారు.
    ఇది కూడా చదవండి: అయ్యో పాపం.. జీవితాంతం సంపాదించిన సొమ్మంతా ఒక్క ఫోన్ కాల్ తో మటాష్.. ఏకంగా రూ.77 లక్షలు..
    Published by:Hasaan Kandula
    First published: