కశ్మీర్‌లో ఉగ్రవాదుల బీభత్సం.. యాపిల్ వ్యాపారి, కార్మికుడి దారుణ హత్య

ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లో 72 రోజుల తర్వాత పోస్ట్ పెయిడ్ మొబైల్ సేవలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. మొబైల్ సేవలు ప్రారంభమైన తర్వాత ఉగ్రవాదులు దాడులకు పాల్పడడం ఇది నాలుగోసారి.

news18-telugu
Updated: October 16, 2019, 10:20 PM IST
కశ్మీర్‌లో ఉగ్రవాదుల బీభత్సం.. యాపిల్ వ్యాపారి, కార్మికుడి దారుణ హత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. బుధవారం సాయంత్రం షోపియన్ జిల్లాలో యాపిల్ పండ్ల వ్యాపారులు చరణ్ జిత్ సింగ్, సంజీవ్‌పై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చరణ్‌జిత్ చనిపోయారు. ఇక సంజీవ్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. త్రెంజ్ ప్రాంతంలో రాత్రి 07.30 సమయంలో ఘటన జరిగింది. సుమారు నలుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.

ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లో 72 రోజుల తర్వాత పోస్ట్ పెయిడ్ మొబైల్ సేవలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. మొబైల్ సేవలు ప్రారంభమైన తర్వాత ఉగ్రవాదులు దాడులకు పాల్పడడం ఇది నాలుగోసారి. అంతకుముందు బుధవారం పుల్వామా జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కాకపోరా ప్రాంతంలో ఓ కార్మికుడిని ఉగ్రవాదులు హతమార్చారు. మృతుడిని చత్తీస్‌గఢ్‌కు చెందిన సెథీ కుమార్‌గా గుర్తించారు. అతడు కశ్మీర్‌లో ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఇక రెండు రోజుల క్రితం పండ్ల లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కుపై దాడిచేసి.. డ్రైవర్‌ను కాల్చి చంపారు. పండ్ల వ్యాపారిపైనా దాడి చేసి చితకబాదారు. కశ్మీర్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు రవాణాకు ఆటంకం కలిగించేందుకే ఉగ్రవాదులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అధికారులు భావిస్తున్నారు.

First published: October 16, 2019, 10:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading