వృద్దురాలైన తల్లిపై కోర్టులో పిటిషన్.. సీరియస్‌గా స్పందించిన హైకోర్టు.. దుర్బుద్ధి కనిపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు..

పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు

తల్లిని వేధిస్తూ, ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టాలని యత్నించిన కొడుకుపై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడు సొంత తల్లిని ఇంటి నుంచి తరిమివేయాలని చూశాడని కోర్టు అభిప్రాయపడింది.

 • Share this:
  తల్లిని వేధిస్తూ, ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టాలని యత్నించిన కొడుకుపై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడు సొంత తల్లిని ఇంటి నుంచి తరిమివేయాలని చూశాడని కోర్టు అభిప్రాయపడింది. వృద్దురాలైన తల్లి, మేనమామల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇది చాలా దురదృష్టకరమైన పిటిషన్ అని జస్టిస్ అరవింద్ సింగ్ సాంగ్వాన్ వ్యాఖ్యానించారు. వివరాలు.. సన్నీ గోయల్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశాడు. అందులో తన తండ్రి 2013 నవంబర్ 11న వీలునామా రాసినట్టు చెప్పారు. అతని వ్యాపారంలో 100 శాతం వాటాను సన్నీ గోయల్‌కు రాశారు. అయితే ఇంటిలో మాత్రం 50 శాతం సన్నీ గోయల్‌కు, మిగిలిని 50 శాతం వాటాను తన భార్యకు రాజేష్ గోయల్ రాశారు.

  అయితే ఆ తర్వాత సన్నీ గోయల్.. తన తల్లి వాటాకు సంబంధించి జనరల్ పవర్ అటార్నీ పొందినట్టుగా కోర్టుకు తెలిపాడు. అయితే దీనిని పరిశీలించిన కోర్టు.. సన్నీ గోయల్ నిజాయితీ లేకుండా తనకు అనుకూలంగా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్నట్టుగా కోర్టు తెలిపింది. ఇది దుర్భుద్దితో చేసిన పని అని అభిప్రాయపడింది. వృద్దురాలైన తన తల్లిని ఇంటి నుంచి వెళ్ళ గొట్టడానికి, ఆమె వాటాను అమ్మేయడానికి ఈ పిటిషన్‌ను ఆధారంగా చేసుకున్నట్టుగా కనిపిస్తోందని పేర్కొంది.

  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు నుంచి, ఈ పిటిషన్‌లో ధాఖలు చేసిన విషయాలను చూస్తే పిటిషినర్ అత్యాశ కనిపిస్తోందని కోర్టు పేర్కొంది. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఖర్చుల క్రింద రూ.1 లక్ష చెల్లించాలని ఆదేశిస్తూ, పిటిషనర్ నుంచి ఈ సొమ్మును రెండు నెలల్లోగా రాబట్టాలని మొహాలీ, ఎస్ఏఎస్ నగర్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఇది పిటిషనర్ తల్లికి అందజేయాలని సూచించింది.
  Published by:Sumanth Kanukula
  First published: