హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కాపాడాలని కోర్టుకెళ్లిన కొత్త జంటకు రూ. 10 వేలు జరిమానా... ఎందుకంటే...

కాపాడాలని కోర్టుకెళ్లిన కొత్త జంటకు రూ. 10 వేలు జరిమానా... ఎందుకంటే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్ 19 కారణంగా మాస్కులు ధరించడం తప్పనిసరి అనే నిబంధన ఉన్నప్పటికీ... కొత్త జంట పాటించలేదని వ్యాఖ్యానించారు న్యాయమూర్తి.

తమ పెద్దవాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఆ జంట... వారి నుంచి భద్రత కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఇందుకోసం ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి... ఎవరూ ఊహించని విధంగా వారికి రూ. 10 వేలు జరిమానా వేశారు. అయితే జడ్జి వారికి జరిమానా వేయడం వెనుక అసలు కారణం వేరే ఉంది. పెళ్లి చేసుకున్న సమయంలో ఆ ఇద్దరూ మాస్కులు ధరించలేదనే కారణంగా జడ్జి వారికి రూ. 10 వేలు ఫైన్ వేశారు. వారి పెళ్లి ఫోటోలను పరిశీలించిన జడ్జి... ఆ ఫోటోల్లో వారిద్దరూ మాస్కులు పెట్టుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో ఈ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.

కోవిడ్ 19 కారణంగా మాస్కులు ధరించడం తప్పనిసరి అనే నిబంధన ఉన్నప్పటికీ... కొత్త జంట పాటించలేదని వ్యాఖ్యానించారు న్యాయమూర్తి. ఈ కారణంగానే వారికి రూ. 10 వేలు జరిమానా వేశారు. హోషియార్‌పూర్‌ డీసీలో ఈ మొత్తాన్ని 15 రోజుల్లో డిపాజిట్ చేయాలని... ఈ మొత్తాన్ని అక్కడి ప్రజలకు మాస్కులు సమకూర్చడం కోసం ఖర్చు చేయాలని ఆదేశించారు. అనంతరం కొత్త జంటకు ఎలాంటి హాని కలగకుండా చూడాలని గురుదాస్‌పూర్ ఎస్ఎస్పీని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

First published:

Tags: Coronavirus, High Court

ఉత్తమ కథలు