Puneeth Rajkumar James: సొంత నేలపై పునీత్ రాజ్‌కుమార్‌కు అన్యాయం జరుగుతుందా..?
Puneeth Rajkumar James: సొంత నేలపై పునీత్ రాజ్‌కుమార్‌కు అన్యాయం జరుగుతుందా..?
Puneeth Rajkumar James: కన్నడనాట దివంగత పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చనిపోయినపుడు వచ్చిన 14 లక్షల మంది సాక్ష్యం.. అలాగే మొన్న ఆయన జయంతి రోజు విడుదలైన జేమ్స్ సినిమాకు వచ్చిన.. వస్తున్న కలెక్షన్సే నిదర్శనం.
Puneeth Rajkumar James: కన్నడనాట దివంగత పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చనిపోయినపుడు వచ్చిన 14 లక్షల మంది సాక్ష్యం.. అలాగే మొన్న ఆయన జయంతి రోజు విడుదలైన జేమ్స్ సినిమాకు వచ్చిన.. వస్తున్న కలెక్షన్సే నిదర్శనం.
కన్నడనాట దివంగత పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చనిపోయినపుడు వచ్చిన 14 లక్షల మంది సాక్ష్యం.. అలాగే మొన్న ఆయన జయంతి రోజు విడుదలైన జేమ్స్ సినిమాకు వచ్చిన.. వస్తున్న కలెక్షన్సే నిదర్శనం. కేవలం 5 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసి.. కన్నడ ఇండస్ట్రీ మునుపెన్నడూ లేని రికార్డులను పరిచయం చేసింది ఈ చిత్రం. అప్పు చివరి సినిమా చూడటానికి ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.
విడుదలైన ఆరు రోజుల తర్వాత కూడా థియేటర్స్ దగ్గర హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. దానికితోడు మార్చ్ 17 నుంచి 24 వరకు ఆ రాష్ట్రంలో మరే ఇతర సినిమా విడుదల చేయకూడదనే నిర్ణయం కూడా తీసుకున్నారు బయ్యర్లు. పునీత్‌కు వాళ్లు ఇచ్చే నివాళి అది. చేతన్ కుమార్ తెరకెక్కించిన జేమ్స్ సినిమాకు రెస్పాన్స్ అదిరిపోయింది. రొటీన్ కథతోనే వచ్చినా కూడా అందులో పునీత్ ఎనర్జీ చూసి ఫిదా అయిపోయారు ఆడియన్స్.
మరీ ముఖ్యంగా టాక్ పరంగా కాకుండా.. సినిమాను కేవలం పునీత్ జ్ఞాపకంగా చూస్తున్నారు ఫ్యాన్స్. అందుకే కలెక్షన్స్ కూడా ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికీ రోజుకు మంచి వసూళ్లే వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా పునీత్ రాజ్‌కుమార్ జేమ్స్ సినిమాకు కర్ణాటకలో అన్యాయం జరుగుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాగా ఆడుతున్న కొన్ని థియేటర్స్ నుంచి జేమ్స్ సినిమాను బలవంతంగా తీసేసి.. ఆ స్థానంలో ది కాశ్మీర్ ఫైల్స్, ట్రిపుల్ ఆర్ సినిమాలు వేయాలని చూస్తున్నారంటూ పునీత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
రెండో వారం కూడా కచ్చితంగా జేమ్స్ సినిమాకు మంచి వసూళ్లు వస్తాయంటున్నారు అభిమానులు. కానీ మొదటి వారం తర్వాత కావాలనే తమ హీరో సినిమాను తీసేసి.. ఇతర సినిమాల వైపు అడుగులు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పునీత్ అభిమానులు. సాధారణంగానే పునీత్ సినిమాకు కన్నడనాట లాంగ్ రన్ ఎక్కువగా ఉంటుంది. 100 రోజుల సినిమాలు అత్యధికంగా ఉన్న కన్నడ హీరో మాత్రమే కాదు.. సౌత్ హీరో కూడా.
గత 20 ఏళ్లలో పునీత్ నటించిన చాలా సినిమాలు 100 రోజులకు పైగానే ఆడాయి. కానీ ఇప్పుడు జేమ్స్ కనీసం రెండు వారాలు కూడా లేకుండానే.. మొదటి వారమే తీసేస్తున్నారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు ఇదెక్కడి అన్యాయం.. మనిషి లేడని.. అడిగేవాళ్లు లేరని తమ హీరో సినిమాను థియేటర్స్ నుంచి తొలగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పునీత్ అభిమానులు.
అలాంటిదేం లేదు.. మొదటి వారం అగ్రిమెంట్ తర్వాత రెండో వారం నుంచి వేరే సినిమాలు వేసుకుంటున్నామని చెప్తున్నారు థియేటర్స్ యాజమాన్యం. ఏదేమైనా రెండో వారమే చాలా చోట్ల జేమ్స్ సినిమాను పక్కన పెడుతుండటంతో ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.