హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Money Rain: మంత్రాలతో డబ్బుల వర్షం కురిపిస్తా.. ఆ మంత్రం మీకు నేర్చుకోవాలనుందా.. అంటూ ఓ మాంత్రికుడు..

Money Rain: మంత్రాలతో డబ్బుల వర్షం కురిపిస్తా.. ఆ మంత్రం మీకు నేర్చుకోవాలనుందా.. అంటూ ఓ మాంత్రికుడు..

ప్రతీకాత్మక చిత్రం (image credit : youtube)

ప్రతీకాత్మక చిత్రం (image credit : youtube)

Money Rain: ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్న టెక్నాలజీ యుగంలో మంత్రాల నెపంతో కొంతమంది అమాయకులను మోసం చేస్తున్నారు. అయితే ఓ బడా వ్యాపారి మాత్రం దీన్ని అమాయకంగా నిజమనుకుని నమ్మి రూ.52 లక్షలను సమర్పించుకొని మోసపోయాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

ఇంకా చదవండి ...

మంత్రాలకు చెట్లకు ఉన్న ఆకులు రాలుతాయా.. అసలు ఈ భూలోకంలో మంత్రాలు అనేవి ఉన్నాయా.. అంటే ఎవరికీ పూర్తిగా తెలియని పరిస్థితి. కానీ మంత్రాల నెపంతో మాత్రం అమాయకులను దొంగ బాబాలు, మాంత్రికులు మోసం చేస్తున్నారు. అలాంటి ఘటనే పూణెలో చోటుచేసుకుంది. మంత్రాలతో డబ్బుల వర్షం కురుస్తాయంటూ ఓ వ్యాపారిని మోసం చేశాడో మాంత్రికుడు. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్న టెక్నాలజీ యుగంలో మంత్రాల నెపంతో కొంతమంది అమాయకులను మోసం చేస్తున్నారు. ఆ బడా వ్యాపారి మాత్రం దీన్ని అమాయకంగా నిజమనుకుని నమ్మాడు. నమ్మడం వరకు అయితే ఫర్వాలేదు కాని.. ఆ మంత్రమేదో తనకు నేర్పించమంటూ ఆ మాటలు చెప్పిన వ్యక్తిని గురూజీగా పిలుస్తూ దక్షిణ (ఫీజు) కింద రూ. 52 లక్షలు సమర్పించుకున్నాడు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా.. స్వయంగా కలిసినా రేపు మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నాడే తప్ప ఒక్క సారి కూడా మంత్ర విద్య ను నేర్పలేదు.

దీంతో అతడు మహారాష్ట్రలోని పుణే పోలీసులకు ఆశ్రయించాడు. పోలీసుల కథనం ప్రకారం కిసాన్ పవార్ (45) అనే వ్యక్తి తాను మంత్రికుడినంటూ 2016లో ఓ వ్యాపారవేత్తను పరిచయం చేసుకున్నాడు. అతడు కనిపించిన ప్రతీసారి చిన్న చిన్న మ్యాజిక్ లు చేస్తూ అతడిని నమ్మించాడు. తనకు అతీంద్రీయ శక్తులున్నాయని.. ఏమి కోరుకుంటే దాన్ని నెరవేర్చుకోవచ్చని అతడికి ఆశలు రేపాడు. నీకు న్న కష్టాలను మొత్తం తొలగిస్తానంటూ మ్యాజిక్ లు చేసుకుంటూ అతని వద్ద అప్పుడప్పుడు డబ్బు లాగాడు. చిన్న చిన్న మంత్రాలు కాకుండా కొడితే కుంభ స్థలం కొట్టాలంటూ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. తనకు డబ్బుల వర్షం కురిపించే మంత్రం తెలుసంటూ అతడిని పూర్తిగా నమ్మించాడు. అది నేర్పిస్తానంటూ అతడి వద్ద ఆ వ్యాపారి విడదత వారీగా రూ.52 లక్షలు తీసుకున్నాడు.

అప్పటి నుంచి ఇద్దరి మధ్య పరిచయం తగ్గిపోయింది. మంత్రం నేర్పమని ఎప్పడు అడిగినా రేపు మాపు అంటూ వారం.. నెలలు.. సంవత్సరాలు తిప్పించుకున్నాడు. చివరకు తాను మోసపోయానని గ్రహించి ఓ రోజు అతడిని గట్టిగా నిలదీశాడు. డబ్బుల వర్షం కురిపించాలంటే నరబలి ఇవ్వాల్సి ఉంటుందని కిసాన్ పవార్ చెప్పాడు. దీంతో షాక్ తిన్న వ్యాపారి వెంటనే పుణె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు స్టేషన్ కు వచ్చి వ్యాపారి చెబుతున్న మాటలు విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. మాంత్రికుడినని చెప్పుకున్న కిసాన్ పవార్ అనే వ్యక్తి మోసగాడని.. అతడు గారడీలు చేసే టైపు వ్యక్తి అని తేల్చారు. మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పుణె ఏసీపీ సురేంద్రనాధ్ దేవ్ ముఖ్ హెచ్చరించారు.

First published:

Tags: Crime, Crime news, Fake news, Maharashtra, Mantras, Pune news

ఉత్తమ కథలు