Pune Techie Meets Elon Musk : ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ (Elon Musk)అంటే తెలియని నెటిజన్లు చాలా అరుదు. టెస్లా (Tesla), స్పేస్ ఎక్స్ (SpaceX) వంటి ప్రముఖ కంపెనీల CEO అయిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ (Twitter) లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. కొన్నిసార్లు ఆయన చేసే చిన్న ట్వీట్ సైతం ఒక పెద్ద వార్తగా మారుతుంది. ఆయన ట్వీట్ ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ ట్రెండ్స్‌ను ప్రభావితం చేయగలదు. అంతటి శక్తిమంతుడైన మస్క్ తాజాగా తన ట్విటర్ ఫాలోవర్, భారతదేశానికి చెందిన తన చిరకాల మిత్రుడిని సర్ప్రైజ్ చేశారు. పూణెకు చెందిన ప్రణయ్ పాఠోల్(Pranay Pathole)అనే 23 ఏళ్ల మేషీన్ లెర్నింగ్ ఇంజినీర్ ని మస్క్ ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రణయ్ పాఠోల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ప్రణయ్ పాఠోల్ సోమవారం ఓ ట్వీట్ లో.."టెక్సాస్ లోని గిగాఫాక్టరీలో మస్క్‌ను కలవడం చాలా గొప్ప విషయం. ఇంత నిరాడంబరమైన వ్యక్తిని(Down to earth peron)ఎప్పుడూ చూడలేదు. కొన్ని లక్షల మందికి స్పూర్తిప్రదాయకమైన వ్యక్తి" అంటూ మస్క్ తో దిగిన ఫొటోని షేర్ చేశాడు.
It was so great meeting you @elonmusk at the Gigafactory Texas. Never seen such a humble and down-to-earth person. You're an inspiration to the millions ???? pic.twitter.com/TDthgWlOEV
— Pranay Pathole (@PPathole) August 22, 2022
నుపూర్ శర్మను చంపేందుకు ఐసిస్ ఫ్లాన్..భారత్ మాస్టర్ స్కెచ్ తో రష్యాలో ఉగ్రవాది అరెస్ట్!
కాగా,పూణెకు చెందిన ప్రణయ్ పాఠోల్ టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నారు. 2018లో ఓ ట్వీట్ ద్వారా మస్క్, పాఠోల్ మధ్య స్నేహం కుదిరింది. ఓ రోజు ప్రణయ్.. టెస్లా కార్లలోని ఆటోమేటిక్ విండ్ స్క్రీన్ వైపర్ల సమస్య గురించి ట్విటర్లో మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. అయితే ఊహించని సర్ప్రైజ్లు ఇవ్వడంలో ముందుండే మస్క్ ప్రణయ్ ట్వీట్ కు నిమిషాల వ్యవధిలో స్పందించారు. తదుపరి కార్లు మార్కెట్లో ప్రవేశపెట్టేనాటికి సమస్యను పరిష్కరిస్తానని ప్రణయ్ ట్వీట్ కు మస్క్ రిప్లై ఇచ్చారు. అలా వారి మధ్య స్నేహం మొదలైంది. అప్పటి నుంచి సాంకేతిక అంశాలు, బహుళ గ్రహాల అవసరం, మనుషులను అంగారక గ్రహానికి పంపడం సహా అనేక రకాల విషయాలపై నేరుగా ఎలాన్ మస్క్ -ప్రణయ్ మధ్య ట్విట్టర్ ద్వారా సంప్రదింపులు జరుగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Elon Musk, Pune, Tesla Motors