హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Women Harassment: మగబిడ్డ కోసం క్షుద్ర పూజలు.. మహిళను నగ్నంగా చేసి.. బూడిద రాసి.. చివరకు..

Women Harassment: మగబిడ్డ కోసం క్షుద్ర పూజలు.. మహిళను నగ్నంగా చేసి.. బూడిద రాసి.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాంకేతికత(Technology) ఎంత అభివృద్ధి చెందుతున్నా, మనుషుల మూఢనమ్మకాలు(Superstitions) మాత్రం దూరం కావట్లేదు. మూఢ నమ్మకాల మత్తులో అభాగ్యుల జీవితాలు నాశనమైన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా మహారాష్ట్ర(Maharashtra)లోని ఓ కుటుంబం మగబిడ్డ కోసం క్షుద్రపూజలకు(For witchcraft) ఒడిగట్టింది. తర్వాత ఏం జరిగిందంటే..

ఇంకా చదవండి ...

సాంకేతికత(Technology) ఎంత అభివృద్ధి చెందుతున్నా, మనుషుల మూఢనమ్మకాలు(Superstitions) మాత్రం దూరం కావట్లేదు. మూఢ నమ్మకాల మత్తులో అభాగ్యుల జీవితాలు నాశనమైన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా మహారాష్ట్ర(Maharashtra)లోని ఓ కుటుంబం మగబిడ్డ కోసం క్షుద్రపూజలకు(For witchcraft) ఒడిగట్టింది. కట్టుకున్న భర్తతో పాటు సొంత అత్తమామలు కలిసి ఒక మహిళను వివస్త్రను చేశారు. ఆమె ఒంటికి బూడిద(Gray) రాసేందుకు యత్నించారు. ఒక మంత్రగాడి (Wizard) సమక్షంలో ఇలా చేసినట్లు తెలుస్తోంది.

ఇది చదవండి: దొంగతనానికి వచ్చారు.. యజమాని చేతిలో రూ.500 పెట్టి.. చివరకు ఏం చేశారో తెలుసా..

వివరాల్లోకి వెళ్తే.. పూణె (Pune) జిల్లా ఖేడ్ తహసిల్‌కు చెందిన ఓ కుటుంబం గుట్టుగా క్షుద్ర పూజలు(witchcraft) నిర్వహించింది. ఇందులో భాగంగా అత్తమామలు కోడలిని నగ్నంగా చేసి ఆమె ఒంటిపై బూడిద(Gray) రాశారు. ఈ విషయం బయటకు రావడంతో పింప్రి చెంచ్వాడాలోని చకాన్ పోలీస్ స్టేషన్‌లో వీరిపై కేసు నమోదైంది. సదరు మహిళ ఫిర్యాదు(Complaint)తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మగబిడ్డ కోసం కోడలిని ఈ విధంగా మార్చారని పోలీసులు తెలిపారు. ముందు బూడిద తినాలని మంత్రగాడు ఆ మహిళను ఆదేశించాడని, కొంత బూడిదను ఆమె ఒంటికి రాయాలని అత్తకు చెప్పాడని పోలీసులు చెప్పారు.

ఇది చదవండి: వృద్ధురాళ్లపై లైంగిక దాడి.. నిందితుల్లో ఒకరికి 22 ఏళ్లు.. మరొకరికి 32 ఏళ్లు..

భర్త(Husband)తో పాటు అత్తపై కూడా బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. క్షుద్ర పూజలో భాగంగా తన దుస్తులు తీసేశారని, పసుపు, కుంకుమతో పాటు బూడిద కూడా కలిపి శరీరానికి రాసేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. వారిపై బాధితురాలు గృహ హింస (Domestic violence) కేసు కూడా నమోదు చేసింది. గత నాలుగేళ్లుగా తనను ఎంతో చిత్రహింసకు గురిచేశారని, వరకట్నం(Dowry) కోసం వేధించేవారని తెలిపింది. తనను ఎన్నో సార్లు పుట్టింటికి పంపారని, మగబిడ్డను కనకుంటే భర్తకు మరో పెళ్లి చేస్తామని కుటుంబసభ్యులు బెదిరించారని తన గోడు వెళ్లబోసుకుంది.

మహిళ ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 354, 498(ఏ), 323, 504, 506, 34, 3, 35 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు మహారాష్ట్ర ప్రివెన్షన్ ఎరాడిక్షన్ ఆఫ్ హ్యూమన్ సాక్రిఫైస్ సెక్షన్ (Prevention Eradication of Human Sacrifice Section) 3 కింద, ఈవిల్ అండ్ అఘోరీ ప్రాక్టీసెస్, బ్లాక్ మ్యాజిక్ చట్టం- 2013 ప్రకారం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణ (Trial) కొనసాగుతోంది.

Published by:Veera Babu
First published:

Tags: Black magic, Crime, Harassment, Pune, Pune news

ఉత్తమ కథలు