PUNE PRIME MINISTER NARENDRA MODI WANTS TO REDUCE DEPENDENCE ON FOREIGN GOODS COMMENTS AT THE BEGINNING OF JITO CONNECT BUSINESS MEET GH VB
Narendra Modi: విదేశీ వస్తువులపై ఆధారపడం తగ్గించాలి.. JITO కనెక్ట్ బిజినెస్ మీట్ ప్రారంభంలో మోదీ కీలక వ్యాఖ్యలు..
ప్రధాని మోదీ (Image : PTI)
'విదేశీ వస్తువులకు బానిసత్వాన్ని' (slavery to foreign goods) తగ్గించాలని మోదీ శుక్రవారం పిలుపునిచ్చారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పూణేలో నిర్వహిస్తున్న 'JITO కనెక్ట్ 2022 బిజినెస్ మీట్’ను (JITO Connect) వీడియో లింక్ ద్వారా ప్రారంభించిన మోదీ.. భారత్‌లో తయారీని ప్రోత్సహించాలని కంపెనీలను కోరారు.
భారతీయులు విదేశీ వస్తువులపై ఆధారపడంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi). దేశానికి స్వాతంత్య్రం (Independence) వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో 'విదేశీ వస్తువులకు బానిసత్వాన్ని' (slavery to foreign goods) తగ్గించాలని మోదీ(Modi) శుక్రవారం పిలుపునిచ్చారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పూణేలో నిర్వహిస్తున్న 'JITO కనెక్ట్ 2022 బిజినెస్ మీట్’ను (JITO Connect) వీడియో లింక్(Video Link) ద్వారా ప్రారంభించిన మోదీ.. భారత్‌లో తయారీని ప్రోత్సహించాలని కంపెనీలను కోరారు. 'వోకల్ ఫర్ లోకల్' విధానాన్ని పాటిస్తూ విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రతిభ, వాణిజ్యం, సాంకేతికతను మన దేశం వీలైనంత మేరకు ప్రోత్సహిస్తోందని, ప్రతిరోజూ డజన్ల కొద్దీ స్టార్టప్‌లు ఏర్పాటవుతున్నాయని మోదీ చెప్పారు. ప్రతి వారం ఒక యునికార్న్ ఆవిర్భవిస్తోందన్నారు. దేశం స్వావలంబన సాధించడం (self-reliant India) అనేది తమ మార్గమని, ఇది తమ సంకల్పమన్నారు. ఇప్పుడు మారుమూల గ్రామాల ప్రజలు, చిన్న దుకాణదారులు, స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించవచ్చని తెలిపారు. ఇప్పటికే 40 లక్షలకు పైగా విక్రేతలు GeM పోర్టల్‌లో చేరారని చెప్పారు. ప్రభుత్వ ప్రక్రియ (government processes) పారదర్శకంగా మారాయని వివరించారు.
‘ఈ రోజు ప్రపంచం లక్ష్యాలను సాధించడానికి భారతదేశ అభివృద్ధి తీర్మానాలను ఒక సాధనంగా పరిగణిస్తోంది. ప్రపంచ శాంతి, శ్రేయస్సు, ప్రపంచ సవాళ్లకు సంబంధించిన పరిష్కారాలు మన ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు గొప్ప విశ్వాసంతో చూస్తోంది’ అని ప్రధాని మోదీ చెప్పారు.
* జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి..
జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JITO) అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జైనులను ఏకం చేసే ఒక ప్రపంచ స్థాయి సంస్థ. JITO కనెక్ట్ అనేది మ్యూచువల్ నెట్వర్కింగ్, పర్సనల్ ఇంటరాక్షన్ కోసం ఒక మార్గాన్ని అందించడం ద్వారా పరిశ్రమకు సహాయపడే ప్రయత్నమని నిర్వాహకులు చెబుతున్నారు. JITO కనెక్ట్ 2022 ఈవెంట్‌ను మే 6 నుంచి 8 వరకు పూణేలో నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల ఈవెంట్లో వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విభిన్న సమస్యలపై వేర్వేరు సెషన్లు నిర్వహించనున్నారు. నిర్వాహకుల కోరిక మేరకు ప్రధాని మోదీ ఈ ఈవెంట్‌ను ప్రారంభించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.