స్టార్ హీరో ఫోటోను వాడేస్తున్న పుణె పోలీసులు... కరోనా కట్టడి కోసం...

కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్న మహారాష్ట్రలో ముంబై తరువాత కేసుల సంఖ్య ఎక్కువగా పుణెలోనే నమోదవుతున్నాయి.

news18-telugu
Updated: April 14, 2020, 4:25 PM IST
స్టార్ హీరో ఫోటోను వాడేస్తున్న పుణె పోలీసులు... కరోనా కట్టడి కోసం...
మరోవైపు లాక్‌డౌన్ అమలు చేస్తున్న భార‌త్‌లో సడలింపుల తరువాత కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మంగ‌ళ‌వారం నాటికి 70,756 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. 2293 మంది మృతి చెందారు. 22454 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎంతగానో కృషి చేస్తున్న పోలీసులు... ప్రజలకు అవగాహన కల్పించేందుకు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్ నమూనాను తలపించే హెల్మెట్లు వంటి వాటిని వినియోగిస్తూ ప్రజలకు వైరస్ గురించి తెలియజేస్తున్నారు పలు నగరాల్లోని పోలీసులు. ఈ క్రమంలోనే పుణె పోలీసులు... మరో వినూత్న ప్రయోగం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమిర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ పోస్టర్‌ను కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వినియోగించారు. గజిని సినిమాలో ఆమిర్ ఖాన్ స్టిల్‌ను తమ సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన పోలీసులు... ఏదైనా మర్చిపోండి కానీ... ముఖానికి మాస్క్ వేసుకోవడం మర్చిపోవద్దని సూచించారు.



అంతేకాదు మాస్క్ వేసుకోవడంతో పాటు సోషల్ డిస్టెన్స్ కొనసాగించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని అందులో సూచించారు. అయితే దీనిపై నెటిజన్లు తమదైన స్టయిల్లో స్పందిస్తున్నారు. కొందరు కరోనా అనుమానితుల ఒంటిపై హోమ్ క్వారంటైన్ అని కూడా ఉంటుందని కామెంట్ చేశారు. అయితే చాలామంది నెటిజన్లు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాన్ని అభినందించారు.

మరోవైపు కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్న మహారాష్ట్రలో ముంబై తరువాత కేసుల సంఖ్య ఎక్కువగా పుణెలోనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో పుణెలో కొత్త 33 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో నగరంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 276కు చేరింది.
Published by: Kishore Akkaladevi
First published: April 14, 2020, 4:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading