హోమ్ /వార్తలు /national /

Husband Arrest: భార్య కోరిక తీర్చేందుకు యూట్యూబ్ ను ఆశ్రయించాడు.. చివరికి జైలు పాలయ్యాడు

Husband Arrest: భార్య కోరిక తీర్చేందుకు యూట్యూబ్ ను ఆశ్రయించాడు.. చివరికి జైలు పాలయ్యాడు

ఎస్ఐ కావాలనుకున్నాడు.. అంతా ఓకే అయ్యింది.. సడెన్‌గా అమ్మాయితో పరిచయం.. చివరకు..

ఎస్ఐ కావాలనుకున్నాడు.. అంతా ఓకే అయ్యింది.. సడెన్‌గా అమ్మాయితో పరిచయం.. చివరకు..

అసలే కొత్తగా పెళ్లైంది.. అందులోనూ భార్యను చాలా ప్రేమిస్తున్నాడు.. దీంతో భార్య కోరికను కాదనలేకపోయాడు. అందుకోసం యూట్యూబ్ ను ఆశ్రయించాడు.. చివరికి జైలు పాలయ్యాడు. ఎందుకో తెలుసా..?

భార్యను ప్రేమించే భర్తలు ఎంతో మంది ఉన్నారు.  ఆమె ఏం అడిగినా వెనుక ముందు ఆలోచించకుండా సరే అనే వారు కొందరే ఉంటారు. అందులోనూ కొత్తగా పెళ్లైన తరువాత భార్య కోరిక కోరితే కాదనేవారు చాలా తక్కువమందే ఉంటారు. భార్య అన్న తరువాత చిన్న చిన్న కోరికలు కోరడం కామన్. అయితే కుదిరితే భర్తలు ఆ కోరిక తీరుస్తారు.. లేదా వాయిదా వేస్తారు. మరీ కోరలేని కోరిక కోరితే మాత్రం ఏం చేస్తారు కుదరదని తెగేసి చెబుతున్నారు. కానీ ఓ భర్త మాత్రం భార్య కోసం ఏం చేయడానికి కైనా సిద్ధం అన్నాడు. తన భార్య కోరిక కోరిందని.. ఆమె ఏకం దారితప్పాడు. నేరుగా చైన్ స్నాచర్ అవతారమెత్తాడు. పుణెలోని వాకడ్‌ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యాదవ్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పని చేసేవాడు. ఇటీవలే అతడికి వివాహమైంది. కొత్తగా పెళ్లైంది.. భార్యను బాగా చూసుకోవాలని అనుకున్నాడు. ఆమెను సంతోష పెట్టాలనుకున్నాడు. అయితే ఆమె కోరికల చిట్టా విప్పడంతో యాదవ్‌కు దిమ్మతిరిగిపోయింది.

ఫుడ్ డెలవరీ బాయ్ ఉన్న అతడి.. తన భార్య కోరికలు తీర్చడం ఎలా అని మదన పడ్డాడు. తనకు వచ్చే జీతంతో భార్య కోరికలు తీర్చలేనని అతడికి అర్థమైంది. ఆ విషయం భార్యకు చెబితే ఏమంటుంది అనుకున్నాడో ఏమో.. భార్య కోరిక తీర్చడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు.ఆ వెంటనే అతడు దారితప్పాడు. చైన్‌ స్నాచింగ్‌ను ఎంచుకున్నాడు. రంగంలోకి దిగడానికి ముందు యూట్యూబ్ లో పలు చైన్‌ స్నాచింగ్‌ వీడియోలను చూసి.. ట్రైనింగ్ అయ్యాడు.

ఇదీ చదవండి: 11 కోట్లు పలికిన వీడియో గేమ్.. అది కూడా పాతికేళ్ల నాటి క్రితం గేమ్

చైన్‌ స్నాచింగ్‌ కోసం యాదవ్‌ రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకునేవాడు. ఈ క్రమంలో ఆదివారం వాకడ్ ప్రాంతాన్ని తన టార్గెట్‌గా ఎంచుకున్నాడు యాదవ్‌. ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించసాగాడు. అదే సమయంలో అక్కడ పెట్రోలింగ్‌ లో ఉన్న పోలీసులకు యాదవ్‌ కదలికల్లో తేడా కనిపించడంతో పసిగట్టారు. అతడిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్ లో విచారించగా.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. భార్య కోరికలు తీర్చేందుకు యాదవ్ ఏకంగా దొంగగా మారిన విషయం తెలిసి పోలీసులు విస్తుపోయారు. కాగా, పోలీసులకు చిక్కే వరకు ఏడు ప్రాంతాల్లో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డానని.. సుమారు 121 గ్రాముల బంగారం, రెండు బైక్‌లు దొంగిలించానని విచారణలో యాదవ్ తెలిపాడు. మరి దీనిపై ఆ భార్య ఏం సమాధానం చెబుతుందో చూడాలి..

First published:

Tags: Chain snatching, Crime news, Husband, Pune news

ఉత్తమ కథలు