హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Pune Fire Accident: పుణే రసాయన పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి..

Pune Fire Accident: పుణే రసాయన పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి..

పుణే రసాయన పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం

పుణే రసాయన పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం

మహారాష్ట్రలోని పూణె జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముల్షి తాలూకాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం మంటలు చెలరేగాయి.

  మహారాష్ట్రలోని పుణేలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముల్షి తాలూకాలోని ఓ రసాయన ఫ్యాక్టరీలో సోమవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 12 మంది కార్మికులు మరణించగా.. మరికొందరు ఫ్యాక్టరీలో చిక్కుపోయారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 37 మంది ఉన్నట్టుగా సమాచారం. వీరిలో 17 మంది కంపెనీలోనే చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. పరిశ్రమలో చిక్కుకున్న కార్మికులను తీసుకురావడానికి జేసీబీ సహాయంతో గోడలు పగలగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం తహసీల్దార్ అభయ్ చవాన్ సమాచారం ఇచ్చారు.

  అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. కార్మికులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

  సాయంత్రం 4 గంటల సమయంలో ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయని.. మొత్తం 17 మంది కార్మికులు తప్పిపోయినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. ‘ఇప్పటివరకు మేము 12 కాలిన మృతదేహాలను వెలికితీశాం. వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నారు. ఇతరుల కోసం అన్వేషణ కొనసాగుతోంది అని PMRDA((పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) చీఫ్ ఫైర్ ఆఫీసర్ Devendra Potphode చెప్పారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Fire Accident, Maharashtra, Pune

  ఉత్తమ కథలు