Home /News /national /

PUNE DONT WANT TO BEG PUNE WOMAN SELLING PENS FOR HONEST LIVING WILL LEAVE YOU INSPIRED VB

Photo Viral: ఆ బామ్మ చేసే పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. ఇంతకు ఆమె ఏం చేస్తుందో తెలుసా..

పెన్నులు అమ్ముతున్న బామ్మ (photo: instagram)

పెన్నులు అమ్ముతున్న బామ్మ (photo: instagram)

Photo Viral: ఆ బామ్మ చేస్తున్న పనికి ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఏడు పదుల వయస్సు వచ్చినా ఇంత వరకు ఆమె ఎవరిపై ఆధారపడకుండా తన కాళ్లపై తాను జీవిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  సోషల్ మీడియా(Social Media) వచ్చిన దగ్గర నుంచి ప్రపంచంలోని నలుమూలల ఎక్కడ ఏం జరగుతుందో క్షణాల్లో తెలిసిపోతుంది. ఎంతో మంది టాలెంట్(Talent) ఉన్న వ్యక్తులు బయట ప్రపంచానికి తెలుస్తున్నారు. ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో రాత్రికి రాత్రే కొంతమంది పేరు తెచ్చుకుంటున్నారు. ఇలా వారి టాలెంట్ ను గుర్తించి సోషల్ మీడియాలో పోస్టు చేసే వ్యక్తులు కూడా బాగా పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. వాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోతుంటుంది. రీఅప్ స్టూడియో అనేది వినూత్న బ్రాండ్‌కు సంబంధించినిది. దీని వ్యవస్థాపకురాలు శిఖా రథి అనే యువతి ఓ పోస్టును తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

  ఆంటీని హగ్ చేసుకోవాలి.. పర్మిషన్ ఇవ్వండి.. అంటూ ఆ పసిపాప ఏం చేసిందో చూడండి.. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా..


  అది ఇలా పెట్టిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. అందులో వృద్ధురాలి కథను పంచుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొంతమంది కాళ్లు, చేతులు బాగున్నా.. పని చేయడానికి బద్దకం చూపిస్తుంటారు. రూపాయి సంపాదించడం కాకపోగా.. తల్లిదండ్రులపై ఆధారపడి.. విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు పెడుతుంటారు. ఇక్కడ అతడు పోస్టు చేసిన దాంట్లో.. ఓ బామ్మ.. తన జీవనాధారం కోసం.. తన పని తాను చేయడానికి శరీరం సహకరించకున్నా.. ఎవ్వరినీ చేయి చాచి రూపాయి అడగకుండా.. ఇలా రోడ్డు పక్కన పెన్నులు అమ్ముకుంటూ తన జీవనాన్ని సాగిస్తోంది. ఓ రోజు రతీ తన స్నేహితుడితో కలిసి పూణేలోని ఎమ్‌జి రోడ్‌లో ఉన్నప్పుడు ఆ బామ్మ  కలిసింది. ఆమె పేరు రతన్. ఆ మహిళ సేకరించిన రంగురంగుల పెన్నులను కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసిన పెట్టెలో విక్రయించడం గమనించడం చూసింది రతీ మరియు ఆమె స్నేహితురాలు.

  Samantha Stylist: ప్రీతమ్ జుకల్కర్ ఒక గే.. అతడితో సమంత అలా చేస్తుందా.. నిజాన్ని బయటపెట్టిన..


  ఆ పెట్టెలో పెన్నులు ఉన్నాయి. ఆ పెట్టె బాక్స్ మూతపై చాలా ప్రత్యేకమైన నోట్ వ్రాయబడింది. ఆ నోట్‌లో, “నాకు భిక్షాటన అక్కర్లేదు. దయచేసి రూ 10/- నీలం రంగు పెన్నులు కొనండి. ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించండి. ” అంటూ రాసి ఉంది. రతికి అది చూడగానే మనస్సు కరిగిపోయింది. ఆ బామ్మ ఫోటోను ా యువతి ఫోటో తీసి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ఆ బామ్మ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వయసులో కూడా ఎంతో నిజాయితీతో ఉండి.. తన కాళ్ల మీద తాను నిలబడుతున్న ఈ బామ్మను చూసి ఎంతో నేర్చుకోవాలి. ఆ బామ్మ ప్రతి రోజు ఉదయమే లేవగానే అన్ని పనులు ముగించుకొని తన దగ్గర ఉన్న పెన్నుల డబ్బాలు పట్టుకొని రోడ్డు మీదికి బయలుదేరుతుంది.
  ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనాలు ఆగగానే… ప్రతి వాహనం దగ్గరికి వెళ్లి పెన్నులు కొనాలని వాహనదారులను రిక్వెస్ట్ చేస్తుంది. సాయంత్రం వరకు అక్కడే ఉండి.. అమ్ముడు పోయిన పెన్నుల ద్వారా వచ్చిన డబ్బుతో తన రోజువారి జీవితాన్ని వెళ్లదీస్తుంది. ఇది ఆ బామ్మ స్టోరీ . దీనిని ఆ యువతి తన ఇన్ స్టాగ్రామ్ లో ఇలా రాసింది. తాను ఈ రోజు నిజమైన హీరో.. ఛాంపియన్ ను కలిశానని.. ఆ నోట్ ను చదివిన వెంటనే తాను ఆ పెన్నులను కొన్నట్లు పేర్కొంది. డబ్బులు ఇస్తుంటే ఆమె తీసుకోలేదు.. కేవలం పెన్నులు అమ్మగా వచ్చిన డబ్బులతోనే ఆ బామ్మ జీవనం సాగిస్తుంది.

  ఆ పెన్నులు కొన్న వెంటనే ఆ బామ్మ కళ్లల్లో సంతోషం చూశానని.. ఆమె కృతజ్ఞత, దయతో తనను చూసిందని.. ఆ క్షణాలు మరిచిపోలేనని ఆమె పేర్కొంది. అయితే ఇలా విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా ఎవరిమీద ఆధారపడకుండా.. తన కాళ్లపై తాను నిలబడి ఇలా చేస్తున్న బామ్మకు చాలామంది హ్యాట్సాప్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో బామ్మ మీరు గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Pune, Pune news, Viral photos

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు