పుల్వామా తరహా ఉగ్రదాడి కుట్ర.. భగ్నం చేసిన సైన్యం

2019 ఫిబ్రవరిలో జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తరహాలోనే మరో కుట్ర జరిగింది.

news18-telugu
Updated: May 28, 2020, 4:40 PM IST
పుల్వామా తరహా ఉగ్రదాడి కుట్ర.. భగ్నం చేసిన సైన్యం
ప్రతీకాత్మక చిత్రం (image: Bharat Ke Veer)
  • Share this:
2019 ఫిబ్రవరిలో జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తరహాలోనే మరో కుట్ర జరిగింది. అయితే, ఈసారి ముష్కరుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అప్పట్లో ఓ కారులో పేలుడు పదార్థాలను నింపి సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను ఢీకొట్టడంతో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కూడా అలాగే, కారులో 40 నుంచి 45 కేజీల ఐఈడీ తీసుకుని వెళ్తున్న కారును భద్రతా బలగాలు పట్టుకున్నాయి. పుల్వామా తరహాలో ఉగ్రదాడి జరగొచ్చంటూ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ క్రమంలో బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఫేక్ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో వెళ్తున్న తెలుపు రంగు శాంత్రో కారులో సూసైడ్ బాంబర్ తరలిస్తుండగా భద్రతా బలగాలకు అనుమానం వచ్చి ఆ కారును ఆపడానికి ప్రయత్నించారు. అయితే, ఆ కారు డ్రైవర్ దాన్ని ఆపకుండా బ్యారికేడ్‌ను ఢీకొట్టి వెళ్లిపోయాడు. దీంతో భద్రతా బలగాలు వెంటనే ఫైరింగ్ ఓపెన్ చేశాయి. కొంతదూరం వెళ్లిన తర్వాత కారును వదిలేసి డ్రైవర్ పారిపోయాడని ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఆ డ్రైవర్ హుజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వ్యక్తి అయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. 2019లో పుల్వామా దాడికి పాల్పడిన జైష్ ఈ మొహ్మద్ సంస్థతో కూడా టచ్‌లో ఉండి ఉంటాడని భావిస్తున్నారు. అనంతరం ఆ కారులో ఉన్న పేలుడు పదార్థాలను, కారును ధ్వంసం చేశారు.
First published: May 28, 2020, 4:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading