Home /News /national /

PULWAMA MARTYR MAJOR VIBHUTI SHANKAR DHOUNDIYAL WIFE NIKITA KAUL JOINS INDIAN ARMY SU

Nitika Kaul: ధీర వనిత.. ఆర్మీలో చేరిన పుల్వామా అమరుడు దౌండియల్ సతీమణి.. భర్తకు ఘనమైన నివాళి

మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ భౌతికకాయం వద్ద ఆయన సతీమణి నితికా(ఫైల్ ఫొటో)

మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ భౌతికకాయం వద్ద ఆయన సతీమణి నితికా(ఫైల్ ఫొటో)

జమ్మూకశ్మీర్‌లో 2019లో జరిగిన ఉగ్రదాడిలో అమరుడుడైన మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ సతీమణి నితికా కౌల్ శనివారం ఇండియన్ ఆర్మీలో చేరారు.

    జమ్మూకశ్మీర్‌లో 2019లో జరిగిన ఉగ్రదాడిలో అమరుడుడైన మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ సతీమణి నితికా కౌల్ శనివారం ఇండియన్ ఆర్మీలో చేరారు. లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. సౌత్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి స్వయంగా ఆమె భుజాలపై స్టార్స్ పెట్టి సైన్యంలోకి  ఆహ్వానించారు. భర్త వీరమణం పొందిన కొన్ని నెలలకే తాను కూడా ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నారు నితికా. ఇందుకోసం షార్ట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్‌‌లో, ఇంటర్వ్యూలో కూడా ఉత్తీర్ణత సాధించారు. ఇక, మే 26న నితికా చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ నుంచి ఉత్తీర్ణత సాధించారు. శనివారం అధికారికంగా ఇండియాన్ ఆర్మీలో చేరారు. ఈ సందర్భంగా నితికా మాట్లాడుతూ..‘ఇండియన్ ఆర్మీలో చేరడం ద్వారా నా భర్త మేజర్ విభూతి శంకర్ దౌండియల్ నేను నివాళి ఆర్పించాను. నా ప్రయాణంలో ఆయన నాతోనే ఉన్నారు’అని పేర్కొన్నారు.

    2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో 40 మంది సైనికులు అమరవీరులయ్యారు. ఈ ఘటన తర్వాత పుల్వామాలోని పింగ్లాన్ గ్రామంలో ఉగ్రవాదులను పట్టుకునేందుకు సైన్యం ఆపరేషన్ చేసింది. పింగ్లాన్‌లో జరిపిన ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదుల కాల్పుల కారణంగా నలుగురు సైనికులు అమరవీరులయ్యారు. ఈ అమరవీరులలో మేజర్ ర్యాంక్ ఆఫీసర్ విభూతి శంకర్ దౌండియల్ కూడా ఉన్నారు. మేజర్ దౌండియల్ భౌతికకాయం స్వగ్రామానికి చేరుకున్నప్పుడు ఆయన భార్య నితికా కౌల్.. తన భర్త గురించి గర్వపడుతున్నట్టు చెప్పారు. భర్త భౌతికకాయానికి సెల్యూట్ చేశారు. ఈ ఘటన జరిగిననాటికి దౌండియల్, నితికాల వివాహం జరిగి కనీసం ఏడాది కూడా పూర్తి కాలేదు.







    భర్త భౌతికకాయానికి నివాళులు అర్పించిన సందర్భంలో నితికా మాట్లాడుతూ..‘మీరు నాకు అబద్దం చెప్పారు. మీరు నాకంటే మన దేశాన్ని ఎక్కువగా ప్రేమించారు. అందుకు నేను గర్వపడుతున్నాను. మీరు అందరినీ ప్రేమించే విధానం భిన్నంగా ఉంటుంది. మీరు ఎన్నడూ కలవని ప్రజల కోసం మీ జీవితాన్ని త్యాగం చేశారు. మీరు చాలా గొప్ప ధైర్యవంతుడు. నిన్ను భర్తగా పొందడం నాకు చాలా గర్వంగా ఉంది. నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’అని భావోద్వేగానికి లోనయ్యారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Indian Army, Pulwama Terror Attack

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు