భారత్, పాక్ కలహాల్ని వీడి కలిసుండాలి: ట్రంప్

Pulwama Attack Update: పుల్వామాలో సీపీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మహుతి దాడి అత్యంత భయానకమైందన్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.

news18-telugu
Updated: February 20, 2019, 12:13 PM IST
భారత్, పాక్ కలహాల్ని వీడి కలిసుండాలి: ట్రంప్
ట్రంప్ (ఫైల్ ఫొటో)
  • Share this:
భారత్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ఎట్టకేలకు స్పందంచారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. పుల్వామాలో సీపీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన కారుబాంబు దాడి అత్యంత భయానకమైందన్నారు. పాక్.. భారత్ కలహాల్ని వీడి.. కలిసి ఉండాలని ట్రంప్ హితవు పలికారు. తమకు పొరుగున ఉన్న రెండు దక్షిణ ఆసియా దేశాలు కలిస్తే అద్భుతంగా ఉంటుందన్నారు ట్రంప్. పూల్వామా దాడి ఘటనకు సంబంధించి నివేదికలు తెప్పించుకొని పరిశీలించానన్నారు.

మరోవైపు ఉగ్రదాడి గురించి తెలిసిన వెంటనే ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ భారత్‌కు మద్దతుగా నిలిచారు. పాకిస్తాన్ తక్షణమే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థపై చర్యలు తీసుకోవాలని జాన్ బోల్టన్ డిమాండ్ చేశారు. దాడులపై భారత్‌తో చర్చించామన్నారు. ఉగ్రవాద నిర్మూలనలో దేశానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. పూల్వామా ఉగ్రదాడిపై విచారణకు పాకిస్థాన్ పూర్తి సహకారం అందించాలని కోరారు. దీనికి సంబంధించి ఇప్పటికే పాకస్థాన్‌తోనూ చర్చలు జరిపామన్నారు. వైట్‌హౌస్‌లోని ఇతర విభాగాల అధికారుల కూడా భారత్‌పై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి.

ఇవికూడా చదవండి:

భారత్ చర్యలు పాకిస్థాన్‌కు షాకేనా? ఆర్థికంగా ఎలాంటి నష్టం జరుగుతుంది? ఆసక్తికర అంశాలు

భారత్ చేరుకున్న సౌదీ యువరాజు...ఘన స్వాగతం పలికిన ప్రధాని మోదీ
First published: February 20, 2019, 12:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading