హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bhagwant Mann: ఆస్పత్రిలో చేరిన పంజాబ్ సీఎం.. కారణం ఏంటంటే..

Bhagwant Mann: ఆస్పత్రిలో చేరిన పంజాబ్ సీఎం.. కారణం ఏంటంటే..

భగవంత్ మాన్ (ఫైల్)

భగవంత్ మాన్ (ఫైల్)

Punjab: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆస్పత్రిలో చేరారు. కాగా, తన రెగ్యులర్ చెకప్ లో భాగంగా ఆయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి వెళ్లారు.

పంజాబ్ (Punjab)  ఆప్ ఆద్మీ పార్టీ సీఎం భగవంత్ మాన్ (Bhagwant mann)  ఢిల్లీలోని ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన తన రెగ్యులర్ చెకప్ చేయించుకొవడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆయనను అక్కడి వైద్యులు ప్రత్యేకంగా టెస్ట్ లు చేశారు. కాగా, రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ఆయన ఢిల్లీకి వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, పంజాబ్ సీఎం ఆస్పత్రిలో చేరడంతో..  అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాడు చేశారు. కాగా, ఈ రోజు సిద్ధూ మూసేవాలా ను దారుణంగా హత్య చేసిన దుండగులు పోలీసుల ఎన్  కౌంటర్ లో చనిపోయిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా ప్రముఖ గాయకుడు సిద్దూ మూసే వాలా (Sishu Moose wala) హత్య కేసు సంచలన మలుపు తిరిగింది.

ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న ఓ వ్యక్తి పోలీసులు కాల్పుల్లో మరణించాడు. పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా చీచా భక్నా గ్రామంలో మూసేవాలా హత్యతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు హుటాహుటిన గ్రామానికి వెళ్లారు. ఓ ఇంట్లో ఇద్దరు అనుమానితులు ఉన్నట్లు గుర్తించారు. మూసేవాలా హత్య కేసులో అనుమానితులుగా ఉన్న  మన్‌ప్రీత్ మన్నూ (Manpreet Mannu), జగ్‌రూప్ సింగ్ రూపా (Jagroop Roopa).. ఆ ఇంట్లో ఉన్నట్లు సీసీ ఫుటేజీ ద్వారా నిర్ధారించుకున్నారు. ఐతే పోలీసులను చూసి వారు కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్‌లో ఒకరు మరణించారు. ఘటనా స్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పుల నేపథ్యంలో గ్రామస్తులెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని పోలీసులు సూచించారు.

ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతోందని.. ఐతే అక్కడున్న వారు ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత లేదని SHO సుఖ్‌బీర్ సింగ్ తెలిపారు. వారు గ్యాంగ్‌స్టర్సా లేదంటే మిలిటెంట్లా అన్న విషయం తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మూసేవాలా హత్య కేసులో అనుమానితులుగా ఉన్న మన్‌ప్రీత్, జగ్‌రూప్‌లే అక్కడ ఉన్నారని తెలిసింది. ఘటనా స్థలంలో పలువురు సీనియర్ పోలీసు అధికారులు ఉన్నారు. ఈ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు సీల్ చేశారు. మన్‌ప్రీత్, జగ్‌రూప్ల స్వస్థలం పంజాబ్‌లోని తరన్ తరణ్ జిల్లా. వీరిద్దరు గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ వద్ద పనిచేస్తున్నారు.

First published:

Tags: Bhagwant Mann, Punjab

ఉత్తమ కథలు