హిందీ నేర్చుకుంటే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు: కిరణ్ బేడీ

ప్రజలతో తమ భావాలను తెలిపేందుకు భాష సంధానకర్తగా ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. తనకు తమిళం రాకపోవడం వల్ల తప్పనిసరిగా ట్రాన్స్ లేటర్ల సహాయం తీసుకోవలసి వస్తోందని ఆమె వాపోయారు. హిందీ నేర్చుకుంటే సాంస్కృతిక వారసత్వం ఏమి దెబ్బతినదని ఆమె పేర్కొన్నారు.

Krishna Adithya | news18-telugu
Updated: September 16, 2019, 11:04 PM IST
హిందీ నేర్చుకుంటే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు: కిరణ్ బేడీ
కిరణ్ బేడీ (File)
Krishna Adithya | news18-telugu
Updated: September 16, 2019, 11:04 PM IST
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీని జాతీయ భాష చేయాలని చేసిన వ్యాఖ్యలకు పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. హిందీ భాషను నేర్చుకోవడం ద్వారా కేంద్రం ఆధిపత్యం వహిస్తోందన్న, తమిళనాట రాజకీయ పార్టీలు చేస్తున్న వాదనను పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ తోసిపుచ్చారు. అంతేకాదు హిందీని నేర్చుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు కేంద్రంతో సత్సంబంధాలకు అవకాశం ఏర్పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలతో తమ భావాలను తెలిపేందుకు భాష సంధానకర్తగా ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. తనకు తమిళం రాకపోవడం వల్ల తప్పనిసరిగా ట్రాన్స్ లేటర్ల సహాయం తీసుకోవలసి వస్తోందని ఆమె వాపోయారు. హిందీ నేర్చుకుంటే సాంస్కృతిక వారసత్వం ఏమి దెబ్బతినదని ఆమె పేర్కొన్నారు.

వేర్వేరు రాష్ట్రాల ప్రజల మధ్య సంబంధాలు లేకపోవడానికి భాషే ప్రధాన అడ్డంకిగా మారిందని, అయితే ఈ సమస్యను కొంత మేర ఇంగ్లీష్ భాష తీరుస్తోందని, ఆమె అయినప్పటికీ హిందీ నేర్చుకుంటే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ వారితో మనకు సంబంధాలు ఉండాలని ఆమె కోరారు.

First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...