హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Corona Positive: మరో సీఎంకు కరోనా పాజిటివ్.. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స..

Corona Positive: మరో సీఎంకు కరోనా పాజిటివ్.. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స..

పుదుచ్చేరి సీఎం రంగస్వామి

పుదుచ్చేరి సీఎం రంగస్వామి

Corona Positive: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ మ‌హమ్మారి సామాన్యుల నుంచి సెల‌బ్రిటిల వ‌ర‌కు ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. తాజాగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి కరోనా పాజిటివ్ వచ్చింది.

ఇంకా చదవండి ...

పుదుచ్చేరి కొత్త ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి కరోనా బారిన పడ్డారు. ఇందిరా గాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆయనకు పరీక్షలు నిర్వహించగా అందులో ఆయనకు కరోనా పాజిటివ్ గా వచ్చింది. వైరస్ బారిన పడ్డ రంగసామి చెన్నై లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి సిబ్బంది ఈ విషయాన్ని మీడియాకు తెలిపింది. రంగసామి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉందని.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడ్డారు. అదే విధంగా చాలా మంది సీనియర్‌ రాజకీయనేతలు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, పుదుచ్చేరి ముఖ్య‌మంత్రిగా రంగ‌స్వామి గ‌త శుక్ర‌వారం(మే 7) ప్ర‌మాణ స్వీకారం చేశారు. సీఎంగా బాధ్యతలు చేప‌ట్టిన నాలుగు రోజుల‌కే ఆయ‌న క‌రోనా బారిన ప‌డ్డారు.

First published:

Tags: Cm rangaswamy, Corona positive, Puducherry, Rangaswamy, Tamilnadu

ఉత్తమ కథలు