వ్యాక్సిన్‌కు భయపడకండి: మీరు సమయానికి వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలనే దానికి తగిన 8 కారణాలు

Covid-19 vaccine

వ్యాక్సిన్‌లు అనేవి మానవజాతికి వైద్య శాస్త్రం అందించిన గొప్ప బహుమతులలో ఒకటి. స్మాల్ పాక్స్ మరియు పోలియోతో సహా అనేక ప్రాణాంతక వ్యాధులను నిర్మూలించడానికి లేదా నివారించడానికి అవి ఎంతగానో సహాయపడ్డాయి.

 • Share this:
  వ్యాక్సిన్‌లు అనేవి మానవజాతికి వైద్య శాస్త్రం అందించిన గొప్ప బహుమతులలో ఒకటి. స్మాల్ పాక్స్ మరియు పోలియోతో సహా అనేక ప్రాణాంతక వ్యాధులను నిర్మూలించడానికి లేదా నివారించడానికి అవి ఎంతగానో సహాయపడ్డాయి. సమయానుసారమైన టీకాలు నేడు తీవ్రమైన వ్యాధుల వ్యాప్తిని అరికట్టి ప్రాధమిక రక్షణ అందించడంలో ప్రాతినిధ్యం వహిస్తాయి, అంతేకాకుండా ఇవి వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణా విధానాలలో ఒక ముఖ్యమైన భాగం. వాటి సమర్థత మరియు ఆవశ్యకతను నిరూపించే సాక్ష్యాలు ఉన్నప్పటికీ టీకాల ఉపయోగంపై వ్యతిరేకతను ప్రకటించే వారు ఇప్పటికి కూడా కలరు. భయంకరమైన Covid-19 సెకండ్ వేవ్‌తో భారతదేశం పోరాడుతున్న ఈ సమయంలో టీకాలు వేయించుకోవలసిన అవసరం గురించి ప్రతీఒక్కరికీ వివరించి, ఈ మహమ్మారి నుండి దేశాన్ని కోలుకునేలా చేయడం గతంలో కంటే చాలా ముఖ్యం. అందువలన ఎటువంటి భయం లేకుండా, వీలైనంత త్వరగా ప్రతీ ఒక్కరూ టీకాలు ఎందుకు వేయించుకోవాలి అనే దానికి 5 ముఖ్యమైన కారణాలను మీకు అందిస్తున్నాము.

  వ్యాక్సిన్లు చికిత్స సాధ్యం కాని వ్యాధులను నివారిస్తాయి.

  Covid-19 సంక్షోభ సమయంలో భారతదేశంలోని ఆసుపత్రులలో పడకలు  మరియు ఆరోగ్య సంరక్షణా వసతులకు తీవ్రమైన కొరత ఏర్పడింది. సమయానికి టీకాలు వేయించుకోవడంతో వారికి అంతర్గత సంరక్షణ లభిస్తుందని నిర్ధారించడం వలన దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఈ భారం తగ్గించవచ్చు.  టీకాలు తమ ప్రియమైన వారికి, ఆలాగే సమాజానికి రక్షణ కలిగిస్తాయి.

  టీకా వేయించుకోని చాలా మంది ప్రజలు తమకు తెలియకుండానే తమ ప్రియమైన వారికి ప్రాణాంతక వ్యాధులు సోకడానికి వాహకాలుగా మారతారు. ఒకరినుండి ఒకరికి వ్యాపించే లక్షణం కలిగిన ఈ Covid-19 సంక్షోభ సమయంలో చాలామంది వయసు పైబడిన వారు ఎటువంటి రోగ లక్షణాలులేని తమ పిల్లలు, బంధువుల ద్వారా ఈ వ్యాధి బారిన పడ్డారు.  టీకాలు చికిత్సకు అయ్యే ఖర్చులను తగ్గిస్తాయి

  వాస్తవానికి టీకాలు దేశ ప్రజారోగ్య వ్యవస్థపై భారాన్ని తగ్గిస్తాయి, అంతేకాకుండా దాని చికిత్సకు అయ్యే ఖర్చులను కూడా తగ్గిస్తాయి. పూర్తి ఆరోగ్యంతో కూడిన ప్రజలు సాధారణంగా లాభదాయకమైన ఉత్పాదకతను అందిస్తారు, అందువలన ఇది సానుకూలమైన ఆర్ధిక ఫలితాలను కలిగి ఉంటుంది.  టీకాలు ఇవ్వడం సులభమైన పని

  Covid-19 కు వ్యతిరేకంగా భారతీయులందరికీ టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న Network18 Sanjeevani - A Shot Of Life వంటి ఇమ్యునైజేషన్ క్యాంపెయిన్‌ల ద్వారా టీకాలు పెద్ద సంఖ్యలో ప్రజలకు త్వరగా పంపిణీ చేయడతాయి. అంతేకాకుండా హెల్త్‌కేర్ లీడర్లు ప్రపంచంలోని పేద ప్రాంతాలకు టీకాలను వేగంగా అందించడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నారు.  టీకాలు ఇతర వ్యాధులు సోకే ప్రమాదాన్ని తగ్గిస్తాయి

  టీకాల వలన వచ్చే చిన్న చిన్న దుష్ప్రభావాలు ఇతర సంబంధింత వ్యాధుల నుండి కూడా రక్షణను అందిస్తాయి. ఎందుకంటే అవి శరీరంలో వ్యతిరేకమైన వైరస్ జాతులతో పోరాడి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

  ఈ కారణాలను దృష్టిలో ఉంచుకుని ప్రతీ భారతీయుడు Covid-19 వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే, మనమందరం కలిసి ఈ Covid-19 మహమ్మారిని నిర్ములించగలుగుతాము. అందుకోసం మనమందరం తప్పకుండా టీకా వేయించుకోవాలి, అలాగే ప్రతీ పౌరుడికి సరైన సమాచారం అందించాలి. అంతేకాకుండా సరైన సమాచారంతో వ్యాధి రహిత, సంతోషకరమైన భారతదేశాన్ని నిర్మించేందుకు మార్గాన్ని సుగమం చేయవచ్చు. ఇదే Federal బ్యాంక్ వారి ప్రత్యేక CSR చేపట్టిన భారతదేశపు అతిపెద్ద టీకా డ్రైవ్ Network18 ‘Sanjeevani – A Shot Of Life’ వెనుకగల అసలైన ప్రేరణ. భారతదేశం ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తి కోసం ఈ ఉద్యమంలో చేరి, Covid-19 టీకా గురించి సరైన సమాచారాన్ని భారతీయులందరికీ వ్యాప్తి చేయడంలో సహాయపడండి.   
  Published by:Rekulapally Saichand
  First published: