Home /News /national /

PSYCHIATRIST EXPLAINS HOW TO BOUNCE BACK FROM DISAPPOINTMENT IN RESULTS UMG GH

Exam Results: రిజల్ట్స్ అనుకున్నట్టు రాలేదా..? డోంట్ వర్రీ.. ఇలా ట్రై చేయండి కచ్చితంగా సక్సెస్ అవుతారు..!

రిజల్ట్స్ అనుకున్నట్టు రాలేదా..? డోంట్ వర్రీ.. ఇలా ట్రై చేయండి కచ్చితంగా సక్సెస్ అవుతారు..!

రిజల్ట్స్ అనుకున్నట్టు రాలేదా..? డోంట్ వర్రీ.. ఇలా ట్రై చేయండి కచ్చితంగా సక్సెస్ అవుతారు..!

పరీక్షలంటేనే ఒత్తిడి గురికావడం సహజం. అయితే ఇటీవల కాలంలో ఈ సమస్య విద్యార్థుల్లో తీవ్రంగా ఉంటుంది. పరీక్ష బాగా రాస్తానా..? మంచి మార్కులు వస్తాయా..? ఇలా ఆలోచిస్తూ ఒత్తిడి పెంచుకుంటున్నారు. దీంతో ప్రిపరేషన్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
పరీక్షలంటేనే ఒత్తిడి గురికావడం సహజం. అయితే ఇటీవల కాలంలో ఈ సమస్య విద్యార్థుల్లో తీవ్రంగా ఉంటుంది. పరీక్ష బాగా రాస్తానా..? మంచి మార్కులు వస్తాయా..? ఇలా ఆలోచిస్తూ ఒత్తిడి పెంచుకుంటున్నారు. దీంతో ప్రిపరేషన్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇక రిజల్ట్స్ సమయంలో మరింత ఒత్తిడికి లోనవుతున్నారు. టాప్ ర్యాంకు వస్తుందా..? లేక అసలు పాస్ అవుతానా..? అంటూ ఆలోచిస్తూ బుర్ర పాడుచేసుకుంటున్నారు. పరీక్షలైనా, నిజజీవితమైనా ఇలాంటి ఫలితాలు ఎల్లప్పుడూ అశించిన విధంగా ఉండవన్న సంగతి గుర్తుంచుకోవాలంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు. ఈ విషయంపై ఉండాల్సిన ఆలోచనా ధోరణి, ఇలాంటి పరిస్థితులకు పరిష్కారాలను సూచిస్తున్నారు అపోలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ దేబంజన్ బెనర్జీ. ఆ వివరాలు..

విద్యార్థులు బాధపడటానికి, ఒత్తిడి గురికావటానికి మూలం నిరుత్సాహం. ఇది టీనేజ్ పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోపక్క మనదేశ విద్యావిధానం కూడా అందుకు కారణమవుతోంది. గ్రేడ్లు, ర్యాంకుల కోసం విద్యా‌సంస్థలు విద్యార్థుల మధ్య పోటీని మరింత పెంచాయి. అయితే విద్యార్థుల కెపాసిటీని పరిగణలోకి తీసుకోకుండా అందర్నీ ఒకేలా చూడడం, మరోపక్క ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్.. వెరసి విద్యార్థులపై తీరని భారాన్ని మోపుతున్నాయి.

ఇదీ చదవండి: రాగి పాత్రలో నీరు తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు.. ఈ రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు !


* కొన్ని కేసులను పరిశీలిద్దాం..
14 సంవత్సరాల సుధ, 9వ తరగతి చదువుతోంది. ఈ విద్యార్థికి గణితం అంటే ఇష్టం లేదు. ఆ సబ్జెక్టులో మార్కులు తక్కువగా వస్తున్నాయి. దీంతో ఆమె తల్లిదండ్రులు ప్రత్యేకంగా ట్యూషన్ చెప్పిస్తున్నారు. అయినా ఈ విద్యార్థిలో మార్పు రాలేదు. నిరుత్సాహకరమైన ఫలితాలు వస్తాయనే భయంతో సుధ స్కూల్‌‌కు వెళ్లడం మానేసింది. చివరికి పరీక్షలకు కూడా దూరంగా ఉంది. బయటకు వెళ్లడం, ఆడుకోవడం వంటివి ఆస్వాదించడంపై ఆమెకు ఆసక్తి లేదు. కొన్నాళ్లకు ఇతర విషయాలపై కూడా పూర్తి ఆసక్తిని కోల్పోయింది.

22 ఏళ్ల చందు మెడికల్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. తనకు నచ్చిన కాలేజీలో సీటు వస్తుందని చాలా నమ్మకంగా ఉన్నాడు. అయితే పరీక్షను అనుకున్న విధంగా రాయలేకపోయాడు. దీంతో అతనిలో నిరాశ కమ్ముకుంది. వైద్య వృత్తి సెట్ కాదని అతని కుటుంబం ఎంత ఒప్పించాలని ప్రయత్నించినా చందులో మార్పు రాలేదు. ఫిజీషియన్ కావాలనే తన కెరీర్ కలను వదులుకోలేక నరకయాతన అనుభవించాడు. పెరెంట్స్ సూచన మేరకు అయిష్టంగానే డిగ్రీ కాలేజీలో చేరాడు. అక్కడ కూడా అశించినంత ఫలితాలు రాలేదు. ‘‘ప్రారంభ నిరాశ’’ నిజంగా అతన్ని విడిచిపెట్టలేదు. ఇకపై మెడికల్ ప్రవేశాలను ఎదుర్కొనే ధైర్యాన్ని అతను కూడగట్టుకోలేకపోయాడు.

చాలా మంది విద్యార్థులు పరీక్షలు బాగా రాయలేకపోతే నిరాశకు గురవుతుంటారు. మరికొందరిలో ఆందోళన, అపరాధభావం, ఇంట్లోనే ఉండడం, వేటిపైన ఆసక్తి లేకపోవడం తరచూ చూస్తుంటాం. ఇంకొందరూ స్కూల్స్‌కు వెళ్లడం మానేస్తుంటారు. నిద్రపోకపోవడం, చివరికి ఆత్మహత్యకు కూడా పాల్పడవచ్చు.* నిరాశను పొగొట్టడం ఇలా...
అలాంటి విద్యార్థులకు మద్దతుగా ఉంటూ ప్రోత్సహించాలి. వారు చెప్పే వాటిని శ్రద్దగా వినాలి. పిల్లలు చేసే ప్రతి పనిని మెచ్చుకోండి. ఏదైనా తప్పులు చేస్తే నిందించకండి. ముఖ్యంగా తోబుట్టువులు, ఇతరులతో అసలు పోల్చకండి. మరీ ముఖ్యంగా మీ బాధలను పిల్లల భుజాలపై అసలు వేయకండి.

ఫలితాలతో వచ్చిన నిరాశ నుంచి బయటపడటానికి ఇలా ప్రయత్నించండి.

*మీకోసం సమయం కేటాయించుకోండి.

* మీపై మీరు ప్రేమగా ఉండాలి.

* నేర్చుకునే అవకాశాల కోసం వెతకండి

* మీతోటివారితో, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో చర్చించండి

పరీక్షలు జీవితానికి ముగింపు కాదు. ఎల్లప్పుడూ ఎంపికలు ఉంటాయి. మీకు నచ్చిన దాంట్లో ప్రయత్నం చేసి విజయం సాధించండి.
Published by:Mahesh
First published:

Tags: Exams, JOBS, Results, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు