Home /News /national /

PROTESTING FARMERS REFUSE GOVTS LUNCH OFFER AT MEETING BRING THEIR OWN FOOD TEA IN AMBULANCE BA

Farmers Protest: కేంద్రం ఇచ్చిన భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్రంతో చర్చల కోసం తమ ఆహారాన్ని తామే తెచ్చుకున్న రైతులు (Image; ANI)

కేంద్రంతో చర్చల కోసం తమ ఆహారాన్ని తామే తెచ్చుకున్న రైతులు (Image; ANI)

Farmer Protest: సుమారు 30 మంది రైతు సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. భేటీ సందర్భంగా కేంద్రం ఆఫర్ చేసిన భోజనాన్ని వారు తిరస్కరించారు. తమ భోజనం, టీ కూడా వారు ఆంబులెన్స్‌లో తెచ్చుకున్నారు.

    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ ఉద్యమం చేస్తున్న అన్నదాతలు తాము ఎంత గట్టిగా దీన్ని కోరుకుంటున్నారో చెప్పేందుకు మరో అడుగు ముందుకు వేశారు. రైతుల సంఘాల ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో చర్చల సందర్భంగా మధ్యాహ్నం భోజన సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల ప్రతినిధులకు భోజనం కూడా ఆర్డర్ చేసింది. అయితే, కేంద్రం ఆర్డర్ చేసిన భోజనాన్ని తీసుకునేందుకు రైతు నేతలు తిరస్కరించారు. వారు తమ కోసం తాము ప్రత్యేకంగా భోజనం ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు. దాన్నే తిన్నారు. అలాగే, భేటీ సమయంలో ఏసీ హాల్లో ఖరీదైన కుర్చీలు ఉన్నా కూడా వారు నేలపై కూర్చుని తమ భోజనాన్ని పూర్తి చేశారు. ‘కేంద్రం ఆఫర్ చేస్తున్న భోజనం, టీ కూడా మేం తీసుకోవడం లేదు. మా కోసం మేం ప్రత్యేకంగా భోజనం తెప్పించుకున్నాం.’ అని ఓ రైతు నేత చెప్పినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది.

    ఈ మేక పేరు ‘మోదీ’, ఆ తర్వాత కథ చదవండి..

    రెండు రోజుల్లో రెండు పెళ్లిళ్లు.. నాలుగు రోజుల తర్వాత ఏం జరిగిందంటే..! 

    విమానంలో సెక్స్, అమ్మకానికి లో దుస్తులు.. సోషల్ మీడియాలో ఎయిర్ హోస్టెస్ దుమారం

    సుమారు 30 మంది రైతు సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ చర్చల సందర్భంగా వారు తమ ఆందోళనను కేంద్రం దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విదేశాల్లో ఎక్కడెక్కడ అమల్లో ఉంది? దాని వల్ల రైతులు ఎలాంటి నష్టాలు ఎదుర్కొంటున్నారు? భవిష్యత్తులో తమకు కూడా అదే గతి పడుతుందనే అంశాన్ని వారు కేంద్రం తరఫున ప్రతినిధులుగా వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే, ఈ అంశంపై తాము భరోసా కల్పిస్తామని, కనీస మద్దతు ధర దక్కేలా తాము హామీపత్రం రాసిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీన్ని రైతులు తిరస్కరించారు. తమకు హామీ పత్రాలు అవసరం లేదని, ప్రస్తుతం తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలు తీసుకురావాలని స్పష్టం చేశారు. లేకపోతే కనీస మద్దతు ధర లభిస్తుందనే మరో చట్టం అయినా తీసుకురావాలన్నారు.



    కేంద్రం తెచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులు ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. ఢిల్లీని ముట్టడించారు. సుమారు నెల రోజులకు సరిపడా భోజనం కూడా తమ వెంట తెచ్చుకున్నారు. దీన్ని బట్టి వారు తాడో పేడో తేల్చుకునేందుకే సిద్ధమైనట్టు కనిపిస్తోంది. దీంతో పాటు కనీసం కేంద్రం ఆఫర్ చేసిన ఆహారం కూడా తీసుకునేందుకు వారు నిరాకరించడం విశేషం.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Farmers Protest

    తదుపరి వార్తలు