PROTESTING FARMERS EATING BIRYANI TO SPREAD BIRD FLU SAYS BJP MLA FROM RAJASTHAN BA
Bird Flu: ఆందోళన చేస్తున్న రైతులు బిర్యానీ తినడం వల్లే బర్డ్ ఫ్లూ: బీజేపీ నేత
ఆందోళన చేస్తున్న రైతులు (Image: PTI)
బర్డ్ ఫ్లూ వ్యాపించడానికి కారణంపై ఓ బీజేపీ నేత విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ 45 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు బిర్యానీలు తినడం వల్లే బర్డ్ ఫ్లూ వ్యాపించిందని రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం దేశంలో బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదు. కానీ, కొన్నిచోట్ల పక్షులు చనిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. అయితే, అసలు ఈ బర్డ్ ఫ్లూ వ్యాపించడానికి కారణంపై ఓ బీజేపీ నేత విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ 45 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు బిర్యానీలు తినడం వల్లే బర్డ్ ఫ్లూ వ్యాపించిందని రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశంలో సంక్షోభం సృష్టించే వారిని టెర్రరిస్టులు, దోపిడీదార్లు, దొంగలుగా అభివర్ణించారు. ఆందోళన చేస్తున్న రైతులు దేశం గురించి, దేశ ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. వారు చేస్తున్నది ఆందోళన కాదని, కేవలం పిక్ నిక్ అని వ్యాఖ్యానించారు.
‘వాళ్లు చక్కగా బిర్యానీ తింటున్నారు. జీడిపప్పు, బాదం పప్పు తింటున్నారు. అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లు రోజూ కొత్త కొత్త రకాలుగా ఆహార్యాన్ని మార్చుకుంటున్నారు. వారిలో కొందరు టెర్రరిస్టులు కూడా ఉండొచ్చు. దొంగలు, దోపిడీదార్లు కూడా ఉండొచ్చు. వాళ్ళు రైతులకు శత్రువులు.’ అని దిలావర్ అన్నారు. ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో వారిని అక్కడి నుంచి పంపించకపోతే దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం వారికి నచ్చ జెప్పి అయినా పంపించాలని, లేకపోతే బలవంతంగా అయినా బలగాలను ఉపయోగించైనా పంపించాలని అన్నారు.
भाजपा, राजस्थान के विधायक मदन दिलावर जी का किसानों के लिए आतंकवादी, लुटेरे जैसे शब्दों का इस्तेमाल करना शर्मनाक है।
जिस अन्नदाता ने आपके पेट में अन्न पहुँचाया उनके आंदोलन को आप पिकनिक बता रहे हैं, बर्ड फ्लू के लिए ज़िम्मेदार बता रहे हैं ?
బీజేపీ ఎమ్మెల్యే దిలావర్ కామెంట్లు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. రాజకీయ వర్గాలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోదాస్రా ఆ బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బీజేపీ ఆలోచనా విధానం ఇలా ఉందంటూ కామెంట్ చేశారు. ‘దేశానికి అన్నం పెట్టే వారిని, మీకు అన్నం పెట్టే వారిని బర్డ్ ఫ్లూ కి కారణం అయ్యారని అంటారా? రైతుల ఆందోళన పిక్ నిక్లా ఉందా?’ అని ప్రశ్నించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.