హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Farmers Protest : ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ రైతుల ధర్నా..3కి.మీ మేర ట్రాఫిక్ జామ్

Farmers Protest : ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ రైతుల ధర్నా..3కి.మీ మేర ట్రాఫిక్ జామ్

ఢిల్లీలో రైతుల ఆందోళన

ఢిల్లీలో రైతుల ఆందోళన

Farmers Protest In Delhi : దేశ రాజధాని ఢిల్లీ(Delhi) సరిహద్దుల్లో మరోసారి రైతులు నిరసనలు చేపడుతున్నారు. నిరుద్యోగ సమస్య, తమ మునుపటి సమస్యల పరిష్కారం కోసం జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తోన్న మహా పంచాయత్‌లో పాల్గొనాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Farmers Protest In Delhi : దేశ రాజధాని ఢిల్లీ(Delhi) సరిహద్దుల్లో మరోసారి రైతులు నిరసనలు చేపడుతున్నారు. నిరుద్యోగ సమస్య, తమ మునుపటి సమస్యల పరిష్కారం కోసం జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తోన్న మహా పంచాయత్‌లో పాల్గొనాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. సంయుక్త కిసాన్ మోర్చ (SKM) ఇచ్చిన "మహాపంచాయత్" పిలుపు మేరకు వివిధ రాష్ట్రాలు వందలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకున్నారు. రైతుల ఆందోళనల(Farmers Protest) నేపథ్యంలో ఢిల్లీ సహా సరిహద్దుల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్నదాతల ఆందోళనల దృష్ట్యా దిల్లీలో 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. చాలా చోట్ల రోడ్లపై కాంక్రీట్ స్లాబ్‌లు వేసి రైతులకు రాకుండా చేస్తున్నారు. ఢిల్లీలోకి వస్తున్న అన్ని వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. జంతర్‌మంతర్‌కు చేరుకుంటున్న రైతులను ఎప్పటికప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

ఢిల్లీ-ఉత్తర్ ప్రదేశ్ బార్డర్‌కు సమీపంలోని ఘాజీపూర్‌ దగ్గర నిరసనలో పాల్గొన్న రైతులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతుల ఆందోనల నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. రాజధానికి సమీపంలోని ఢిల్లీ-ఘాజీపూర్ సరిహద్దులో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీ వెలుపలి నుంచి రైతులు వస్తున్నందున సింఘు సరిహద్దు, తిక్రీ సరిహద్దుల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇండియా అంటే ఇదే : హిందూ స్వామిజీని ఇంటికి ఆహ్వానించి పాదపూజ చేసిన ముస్లిం దంపతులు

"మహాపంచాయత్ నిరసన కార్యక్రమాన్ని చాలా శాంతియుతంగా నిర్వహించాలనుకున్నాం. కనీస మద్దతు ధర, విద్యుత్ సవరణ బిల్లు రద్దు లాంటి సమస్యలపైనే మా పోరాటం" అని SKM సభ్యుడు ఒకరు తెలిపారు. తాము ఉద్యమం చేపట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చిందని, వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని రైతులు మండి పడుతున్నారు. అందుకే మరోసారి నిరసనలు చేపట్టాలని నిర్ణయించామని, ఇక్కడి నుంచే తమ భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని చెబుతున్నారు. మరోవైపు, సంయుక్త రోజ్‌గార్ ఆందోళన్ సమితి (SRAS)కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. రోజ్‌గార్ సన్సద్‌ పేరిట ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది.

First published:

Tags: Delhi, Farmers Protest