Farmers Protest: కేంద్రంతో చర్చలకు అంగీకరించిన రైతు సంఘాలు

కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు రైతులు ముందుకొచ్చారు. ఈరోజు (డిసెంబర్ 1) మధ్యాహ్నం 3 గంటలకు జరిగే భేటీకి తాను హాజరవుతానని పంజాబ్ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు ఆర్ఎస్ మాన్సా తెలిపారు.

news18-telugu
Updated: December 1, 2020, 1:44 PM IST
Farmers Protest: కేంద్రంతో చర్చలకు అంగీకరించిన రైతు సంఘాలు
ఆర్ఎస్ మాన్సా, పంజాబ్ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు (Image; ANI)
  • Share this:
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు ఎట్టకేలకు కేంద్రంతో చర్చలకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు ముందుకొచ్చారు. ఈరోజు (డిసెంబర్ 1) మధ్యాహ్నం 3 గంటలకు జరిగే భేటీకి తాను హాజరవుతానని పంజాబ్ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు ఆర్ఎస్ మాన్సా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలను సవరించాలంటూ పంజాబ్, హర్యానాలతో పాటు ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వారంతా తమ తమ రాష్ట్రాల నుంచి ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఢిల్లీ నలు మూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు నగరంలోకి వచ్చారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయుగోళాలు, వాటర్ క్యానన్లను కూడా ప్రయోగించారు. చివరకు రైతులు ఓ అడుగు ముందుకు వేశారు. ఢిల్లీలో అడుగు పెట్టారు. రైతులతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న కేంద్ర ప్రభుత్వం వారిని ఓ గ్రౌండ్‌లోకి రావాలని చెప్పింది. అయితే, తాము బేషరతు చర్చలకు మాత్రమే సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కానీ, రైతులతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నా, అది రోడ్లపై చేయలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు.

మరోవైపు రైతు చట్టాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పారు. రైతుల రాజకీయ పార్టీల ట్రాప్‌లో పడొద్దని చెప్పారు. ఈ రోజు ఆందోళనలు చేస్తున్న రైతులే భవిష్యత్తులో కొత్త చట్టాల వల్ల లబ్ధిపొందుతారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇక రైతులతో చర్చల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇద్దరూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు చర్చల తర్వాత తోమర్ వెళ్లిపోయారు.

కొత్త చట్టాలు వచ్చినా కూడా పాత చట్టాలు ఉంటాయని, రైతులు కోరుతున్నట్టు కనీస మద్దతు ధర అనేది కొనసాగుతుందని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రైతుల అపోహలను దూరం చేసేందుకే సమావేశం జరుగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, తమకు ఈ ఏడాది కనీస మద్దతు ధర లభించిందని, మరో నాలుగైదేళ్ల తర్వాత అది తగ్గుతుందో లేదో అనే ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంతో చర్చల విషయంలో కొన్ని సంఘాలు ముందుకు వచ్చినా మరికొన్ని రైతు యూనియన్లు మాత్రం నో చెబుతున్నాయి. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ చర్చలకు నో చెప్పింది. తాము వెళ్లడం లేదని ఆ కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇక కేంద్రం ఈగోను పక్కన పెట్టి రైతులతో చర్చించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ సూచించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 1, 2020, 1:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading