బీహార్‌లో రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ (Railway recruitment result)రాసిన అభ్యర్ధులు చేపట్టిన నిరసనలు(Protest)ఆందోళనకరంగా మారాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్ధులు రెండ్రోజులుగా చేస్తున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. రైల్వేశాఖ తీరును తప్పుపడుతూ ప్యాసింజర్ రైలుకు నిప్పు(Set fire to a passenger train)పెట్టారు కొందరు నిరసనకారులు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈఘటనలో ప్యాసింజర్ రైలు బోగిల్లో మంటలు చెలరేగాయి. బోగిల్లో సీట్లు, బెర్త్‌లు పూర్తిగా మంటల్లో కాలి బూడిదైపోయాయి. మరోవైపు బీహార్‌లోని సీతామర్హి (Bihar Sitamarhi)రైల్వే స్టేషన్లో ఆర్ఆర్బి-ఎన్టిపిసి (RRB, NTPC)ఫలితాలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన సందర్భంగా పోలీసులు గాలిలో కాల్పులు జరపడంతో ఘర్షణలో పలువురు గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రైల్వే ఆసుపత్రికి తరలించారు.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఎన్టీపీసీ పరీక్షా ఫలితాల్లో జరిగిన అవకతవకలు జరిగాయంటూ అభ్యర్దులు గత రెండ్రోజులుగా బీహార్‌లో ఆందోళనలు, నిరసనలకు దిగారు. కొన్ని చోట్ల రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో రైల్వే బోగీలకు నిప్పు పెట్టారు. పాట్నా(Patna) నలంద(nalanda),నవాదా (nawada), ఆరా(Arrah) హజీపూర్(Hajipur), ప్రాంతాల్లో ఆందోళనలు తీవ్రతరం చేసారు. పాట్నాలో అభ్యర్ధులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు భాష్పవాయువును కూడా ప్రయోగించారు.
నిరసనలు కాదు విధ్వంసమే..
రైల్వే ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన వారి నిరసనలపై రైల్వేశాఖ ఘాటుగా స్పందించింది. రైల్వే స్టేషన్లో హింసకు దిగడం, రైల్వే ఆస్తులకు నిప్పు పెట్టడం వంటి ఘటనలకు పాల్పడితే జీవితాంతం రైల్వేశాఖలో ఉద్యోగం ఇచ్చే అవకాశం లేదని హెచ్చరించింది. అలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో రైల్వేలో ఉద్యోగాలు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. రైల్వే ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన అభ్యర్దులు రెండ్రోజులుగా రైల్వే ఆస్తులకు నష్టం కలిగిస్తున్నట్లు పేర్కొంది.
Bihar: Students protesting against alleged irregularities in Railway Recruitment Board's exam allegedly set a passenger train on fire and pelted stones on police in Arrah
"Videos have been shot and the accused protestors will be arrested after an investigation," says an official pic.twitter.com/NTRydarCJQ
ఈ పరిణామాల్ని తీవ్రంగా పరగణిస్తూ అలాంటి వాళ్లను గుర్తించేందుకు కొందరు రైల్వే సిబ్బందిని నియమించినట్లుగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఎవరైనా హింసాత్మకమైన ఆందోళనలు చేపడతారో వారికి రైల్వేలో ఉద్యోగం ఇవ్వమని తేల్చి చెప్పింది.
#WATCH | Bihar: Several injured in clashes during students' protest against RRB-NTPC results at Sitamarhi railway station, as police open fire in the air pic.twitter.com/ORnmcaoClr
ఆందోళనకారులపై చర్యలు తప్పవు..
బీహార్‌లో విద్యార్దుల ఆందోళనలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. పరీక్ష ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ భారీ ఎత్తున అభ్యర్దులు రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. పరీక్ష ఫలితాల్లో జరిగిన అవకతవకలు వెంటనే సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్దులు, నిరసనకారులు చేస్తున్న విధ్వంసాలపై వీడియోలు చిత్రీకరిస్తున్నామని వాటి ఆధారంగా విచారణ చేపట్టి నిందితుల్ని, నిరసనకారుల్ని అరెస్ట్ చేస్తామని రైల్వే ఉన్నతాధికారి ప్రకటించారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.