బాలీవుడ్ హీరో సల్మాన్‌ను కొడితే రూ.2 లక్షలు బహుమతి!

news18
Updated: June 6, 2018, 2:47 PM IST
బాలీవుడ్ హీరో సల్మాన్‌ను కొడితే రూ.2 లక్షలు బహుమతి!
  • News18
  • Last Updated: June 6, 2018, 2:47 PM IST
  • Share this:

సల్మాన్‌ ఖాన్‌ తన సొంత బ్యానర్ లో  నవరాత్రి పండగ  నేపథ్యంలో ‘లవరాత్రి’ అనే రొమాంటిక్‌ మూవీ  రూపొందిస్తున్నారు. అయితే ఈ  సినిమా హిందువుల మనోభావాలను దెబ్బ తీసేవిధంగా   ఉందని, టైటిల్‌ కూడా హిందువులు పవిత్రంగా భావించే ‘నవరాత్రి’ని అవహేళన చేసేవిధంగా ఉందని 'హిందూ హై ఆజ్' సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.


విహెచ్ పి  మాజీ  అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా  ‘హిందూ హై ఆజ్’ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ  ఆగ్రా  అధ్యక్షుడు గోవింద్ పరాషర్ బహిరంగంగా సల్మాన్ ఖాన్ ను కొట్టిన వారికి ఏకంగా రెండు లక్షల రూపాయల బహుమతి ఇస్తానని  సంచలన ప్రకటన చేసారు.గురువారం ఆగ్రాలోని భగవాన్ థియేటర్‌లో లవరాత్రి సినిమాకు చెందిన పోస్టర్లను 'హిందూ హై ఆజ్' కార్యకర్తలు తగలబెట్టి  నిరసన వ్యక్తం చేశారు . కోట్లాదిమంది  హిందువుల పండగ అయిన నవరాత్రి నేపథ్యంలో సినిమా  తీయడంతో పాటు పర్వదినం  అర్థాన్ని కూడా నాశనం చేసేలా ఉందని, కాబట్టి ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించకుండా  అడ్డుకుంటామని అన్నారు.


కోట్లాది  మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ సల్మాన్ నిర్మించిన లవరాత్రి సినిమాను నిషేధించాలని గోవింద్ డిమాండ్ చేశారు. లవరాత్రి సినిమాను సెన్సార్ బోర్డు అడ్డుకోవాలని, ఒకవేళ దానికి అనుమతిస్తే హిందూ కార్యకర్తలతో కలిసి సినిమాహాళ్లను దహనం చేస్తామని గోవింద్ హెచ్చరించారు.


గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పండుగ తొమ్మిది రోజుల్లో ఓ యువ జంట మధ్య చిగురించే లవ్ స్టోరీని సినిమాలో  చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా సల్మాన్‌ ఖాన్‌ బావ ఆయుష్‌ శర్మ హీరోగా పరిచయం కాబోతున్నారు.


గతంలో సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో, దీపికా పదుకొనే నటించిన ‘పద్మావత్‌’ రాజపుట్, హిందూ  సంస్థల నుండి ఎన్ని  అడ్డంకులు ఎదురయ్యాయో అందరికీ తెలిసిందే .  ‘పద్మావత్‌’ రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతీసేలా ఉం‍దనే ఆరోపణలతో కొన్ని వారాల పాటు వాయిదాపడ్డా.. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో ఊరట లభించి, విడుదలైంది. మరి ఇప్పుడు ఈ సినిమా ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవాలసి వస్తుందో చూడాలి  మరి!

Published by: Sunil Kumar Jammula
First published: June 1, 2018, 4:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading