• HOME
 • »
 • NEWS
 • »
 • NATIONAL
 • »
 • PROSTITUTION NOT A CRIMINAL OFFENCE BOMBAY HC ORDERS RELEASE OF 3 SEX WORKERS BA

వ్యభిచారం క్రిమినల్ నేరం కాదు, బోంబే హైకోర్టు సంచలన తీర్పు

వ్యభిచారం క్రిమినల్ నేరం కాదు, బోంబే హైకోర్టు సంచలన తీర్పు

ప్రతీకాత్మక చిత్రం

ఆర్థికంగా లబ్ధిపొందేందుకు సెక్సువల్‌గా ప్రేరేపించడం, ఓ వ్యక్తిని శృంగారానికి ప్రేరేపించడం నేరమని స్పష్టం చేసింది.

 • Share this:
  Bombay High Court on Prostitution: బోంబే హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. వ్యభిచారం క్రిమినల్ నేరం కాదని స్పష్టం చేసింది. అయితే, ఉద్దేశపూర్వకంగా సెక్సువల్‌గా ప్రేరేపించడం, బ్రోతల్ హౌస్ నిర్వహించడం మాత్రం చట్ట వ్యతిరేకం. చట్ట ప్రకారం వ్యభిచారం క్రిమినల్ నేరం కాదన్న హైకోర్టు ఓ మహిళ తాను ఏం చేయాలనుకుంటుందో (కెరీర్, ఉద్యోగం, వృత్తి)ని ఎంచుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్ర హోంలో ఉన్న ముగ్గురు మహిళలను రిలీజ్ చేసింది. ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) యాక్ట్, 1956 కింద వ్వభిచారం క్రిమినల్ నేరం కాదని జస్టిస్ పృధ్వీరాజ్ చవాన్ తీర్పులో చెప్పారు.

  మహారాష్ట్రలోని మజ్‌గావ్‌లో ఓ ముగ్గురు మహిళలను వ్యభిచారం నేరం కింద పోలీసులు అరెస్టు చేశారు. వారిని బాధితులుగా పేర్కొన్నారు. వారిని ఏడాది నుంచి ప్రభుత్వ నిర్వహించే హోంలో ఉంచారు. ఈ మేరకు మజ్‌గావ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు. ముగ్గురు మహిళల అభీష్టానికి వ్యతిరేకంగా వారిని ఉంచడానికి వీల్లేదని బోంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ముగ్గురు మహిళలను పోలీసులు బాధితులుగా పేర్కొన్నారు. చట్టం ప్రకారం వారిని మూడు వారాలకు మించి హోంలో ఉంచడానికి వీల్లేదు. కానీ, ఏడాదికి పైగా హోంలోనే ఉంచారు. ముగ్గురు మహిళలను తమకు అప్పగించాలంటూ వారి తల్లిదండ్రులు, గార్డియన్లు ముందుకొచ్చారు. అయితే, మహిళలను అప్పగించడానికి మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. దీన్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఆ ముగ్గురు మహిళలు పెద్దవారని, వారు ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో నిర్ణయించుకునే ప్రాథమిక హక్కు వారికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

  ఆ ముగ్గురు మహిళలను వ్యభిచారం నేరం కింద అరెస్టు చేయలేదని, బాధితులుగా పేర్కొన్నారు కాబట్టి, సదరు చట్టం కింద వారిని ఎక్కువకాలం రాష్ట్ర ప్రభుత్వం హోంలో ఉంచడానికి వీల్లేదని కోర్టు చెప్పింది. అదే సమయంలో సదరు మహిళలు వ్యభిచారం చేసే ఉద్దేశంతో వ్యక్తులను సెక్యువల్‌గా ప్రేరేపిస్తున్నారని పిటిషనర్ ఎక్కడా పేర్కొనలేదని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఆర్థికంగా లబ్ధిపొందేందుకు సెక్సువల్‌గా ప్రేరేపించడం, ఓ వ్యక్తిని శృంగారానికి ప్రేరేపించడం నేరమని స్పష్టం చేసింది.

  ఇటీవల హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు అయింది. కోఠిలోని ఓ లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందని పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. అన్ని గదులను తనిఖీలు చేయడంతో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. ఇద్దరు యువతులతో పాటు మరో ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన రఫీక్‌ అనే వ్యక్తి కోఠిలోని పుత్లిబౌలి చౌరస్తా వద్ద ఆదిలాబాద్‌ లాడ్జీ నిర్వహిస్తున్నాడు. పైకి లాడ్జిగా చెప్పినా.. లోపల మాత్రం హైటెక్ వ్యభిచారం జరుగుతోంది. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందడంతో.. సుల్తాన్ బజార్ ఎస్సై లింగారెడ్డి తన టీమ్‌తో కలిసి లాడ్జిపై దాడి చేశారు. ఇద్దరు యువతులు, ఇద్దరు విటులతో పాటు లాడ్జీ సూపర్‌వైజర్ రవిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనక ఇంకెవరైనా ఉన్నారన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: