హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Lunar Land: ఇతడు చంద్రుడిపై భూమిని కొన్నాడు.. అక్కడ ఎకరానికి ఎంత రేటుందో తెలుసా.?

Lunar Land: ఇతడు చంద్రుడిపై భూమిని కొన్నాడు.. అక్కడ ఎకరానికి ఎంత రేటుందో తెలుసా.?

సర్టిఫికెట్ చేపిస్తున్న బికేశ్

సర్టిఫికెట్ చేపిస్తున్న బికేశ్

Lunar Land: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో బికేష్ కుమార్ అనే ప్రాపర్టీ డీలర్ చంద్రుడిపై ఒక ఎకరం భూమిని కొనుగోలు చేశాడు. చంద్రుడిపై భూమి కొనుగోలు చేసేందుకు బికేశ్ కుమార్ నెలన్నర క్రితం లూనా సొసైటీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్నాడు.

ఇంకా చదవండి ...

  చంద్రుడిపైకి ఎన్నో దేశాలు రాకెట్లు పంపుతున్నాయి. మనదేశం కూడా ఆ ప్రయత్నాల్లో ఉంది. 2019 చేపట్టిన చంద్రయాన్ 2 విఫలమైంది. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్ విక్రమ క్రాష్ లాండ్ అయింది. ఐతే ఈ ఏడాదిలో చంద్రయాన్3 ప్రయోగం చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. ఆదిశగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఓ వైపు చంద్రుడిపై వెళ్లేందుకు ప్రయోగాలు జరుగుతుండగానే.. మరోవైపు చంద్రుడిపై భూముల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది చంద్రుడిపై భూమిని రిజిస్టర్ చేయించుకొని.. తమ ప్రియమైన వారికి గిఫ్ట్‌గా ఇచ్చారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో బికేష్ కుమార్ అనే ప్రాపర్టీ డీలర్ చంద్రుడిపై ఒక ఎకరం భూమిని కొనుగోలు చేశాడు. చంద్రుడిపై భూమి కొనుగోలు చేసేందుకు బికేశ్ కుమార్ నెలన్నర క్రితం లూనా సొసైటీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్నాడు. ఆన్‌లైన్‌లో డబ్బులు కూడా చెల్లించాడు. చంద్రునిపై భూమి కొనుగోలుకు సంబంధించిన పత్రాలతో పాటు అతడికి చంద్రుని పౌరసత్వం లభించింది. లూనా సొసైటీ ద్వారా తనకు ఈ పౌరసత్వం లభించిందని బికేశ్ కుమార్ కుమార్ చెప్పారు.

  ఘోర ప్రమాదం నుంచి రైలును కాపాడిన మహిళ.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

  చంద్రుడిపై భూమిని కొనుగోలు చేసిన ఈ వ్యక్తి ఫతేపూర్ జిల్లాలోని థానా కొత్వాలి ప్రాంతంలోని గౌతమ్ నగర్ నివాసి. అతను ఆస్తి కొనుగోళ్ల వ్యాపారం చేస్తున్నాడు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు సందర్భంగా చంద్రునిపై భూమి కొన్న వార్తలను టీవీలో చూశానని, అందులో సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చంద్రునిపై భూమి కొన్నట్లు చూపించారని ప్రాపర్టీ డీలర్ బికేష్ కుమార్ చెప్పారు. ఆ తర్వాత చంద్రుడిపై భూమిని కొనుగోలు చేయాలనే ఉత్సుకత తనకు పెరిగిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే లూనా సొసైటీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ఎకరం భూమి కోసం అతడు $ 158 ఆన్‌లైన్ పేమెంట్ కూడా చేశాడు. ఇది భారత కరెన్సీలో దాదాపు దాదాపు 11 వేల రూపాయలు.

  ఒక్క పుచ్చకాయ కోసం భీకర యుద్ధం.. ఏరులై పారిన నెత్తురు.. వేలాది సైనికులు దుర్మరణం..

  శుక్రవారం సొసైటీ ఆయనకు ఆస్తి పత్రాలను అందించింది. బోర్డింగ్ పాస్‌లు, టిక్కెట్‌లను కూడా సొసైటీ అందించినట్లు బికేశ్ కుమార్ పేర్కొన్నారు.. భవిష్యత్తులో అక్కడికి వెళ్లాల్సి వస్తే తప్పకుండా వెళ్తానని.. చాలా తక్కువ మంది మాత్రమే చంద్రుడిపైకి వెళ్లారని ప్రాపర్టీ డీలర్ బికేశ్ కుమార్ చెప్పారు. కాగా, చంద్రుడిపై నిజంగా మనుషులు జీవించగలరా? లేదా? అక్కడి వాతావరణం ఎలా ఉంటుందన్న దానిపై ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయ. భూమి ఉన్న పరిస్థితులే చంద్రుడిపై ఉంటే.. అప్పుడు అక్కడ కూడా మనుషులు నివసించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐతే లూనా సొసైటీలో ఆస్తి కొన్నంత మాత్రాన.. అది నిజంగా చంద్రుడిపై భూమి కొన్నట్లు కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అది వర్చువల్ ల్యాండ్ మాత్రమేనని.. ఆ పత్రాలను ఇతరులకు బహుమతి రూపంలో ఇచ్చేందుకు మాత్రమే కొందరు కొనుగోలు చేస్తుంటారని చెబుతున్నారు. ఇంకా చంద్రుడి గురించి చాలా విషయాలు తెలియాల్సి ఉందని పేర్కొంటున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Up news, Uttar pradesh

  ఉత్తమ కథలు