హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం (image credit - twitter - @nareshsinh_007)

ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం (image credit - twitter - @nareshsinh_007)

Nashik Road Accident : ప్రయాణికులతో షిర్డీకి వెళ్తున్న బస్సు.. సిన్నార్ దగ్గర.. ట్రక్‌ని ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Nashik Road Accident : మహారాష్ట్ర.. నాసిక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 10 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. శుక్రవారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న లగ్జరీ ట్రావెల్ బస్సు... వావిలోని పతారే గ్రామంలో... ఓ ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. పోలీసుల ప్రకారం ఈ ప్రమాదంలో మరో 17 మంది గాయాలపాలయ్యారు. వారిని సిన్నార్ లోని సిన్నార్ రూరల్ ఆస్పత్రికీ, మరో ప్రైవేట్ అస్పత్రికీ తరలించారు.

అంబెర్‌నాథ్ నుంచి షిర్డీకి బయల్దేరిన ఆ బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా షిర్డీ సాయిబాబా దర్శనానికి వెళ్తున్నారని తెలిసింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అని ప్రాథమికంగా అంచనా వేస్తున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

First published:

Tags: Bus accident, Maharashtra, Road accident, Shirdi

ఉత్తమ కథలు