కరోనా వైరస్‌పై ప్రధాని మోదీ ప్రధాన కార్యదర్శి ఉన్నతస్థాయి సమావేశం

ఉన్నతస్థాయి సమావేశంలో కేబినెట్ సెక్రటరీ, హోంశాఖ కార్యదర్శి, విదేశాంగశాఖ కార్యదర్శి, రక్షణశాఖ కార్యదర్శి, వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి, పౌరవిమానయానశాఖ కార్యదర్శితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Updated: January 25, 2020, 10:43 PM IST
కరోనా వైరస్‌పై ప్రధాని మోదీ ప్రధాన కార్యదర్శి ఉన్నతస్థాయి సమావేశం
ప్రధాని మోదీ
  • Share this:
చైనాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు 40 మందికిపైగా చనిపోయారు. కరోనా రోజు రోజుకూ వ్యాప్తిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక చైనా మన దేశానికి పక్కనే ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈక్రమంలో శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీ సూచనల మేరకు ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.  సమావేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, చైనా నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలు, వైరస్‌ను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యల గురించి ఉన్నతాధికారులు వివరించారు.  ఇక ఆస్పత్రుల్లో స్ర్కీనింగ్ సెంటర్లు, ప్రత్యేక వార్డులు, ల్యాబొరేటరీలు, రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌కి సంబంధించిన వివరాలను వైద్యఆరోగ్యశాఖ అధికారులు అందజేశారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.  అన్ని రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేస్తూ ఎప్పటికప్పడు అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల క్షుణ్ణంగా పరిశీలించాలని పౌర విమానయానశాఖకు సైతం ప్రధాన కార్యదర్శి సూచించారు.

ఈ ఉన్నతస్థాయి సమావేశంలో కేబినెట్ సెక్రటరీ, హోంశాఖ కార్యదర్శి, విదేశాంగశాఖ కార్యదర్శి, రక్షణశాఖ కార్యదర్శి, వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి, పౌరవిమానయానశాఖ కార్యదర్శితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, దేశంలోని 7 అంతర్జాతీయ విమానాశ్రాయాలకు వచ్చిన 115 విమానాల్లో 20వేల మందిని థర్మల్ స్క్రీనింగ్ ద్వారా పరీక్షించారు. ముఖ్యంగా చైనా నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. పరీక్షల కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని సంసిద్ధం చేశారు. పరీక్షల కోసం అవసరైన వైద్య పరికరాలను అందుబాటులో ఉంచారు. అటు రాష్ట్ర ప్రభుత్వాలను సైతం అప్రమత్తం చేశారు. ఎలాంటి అనుమానాస్పద కరోనా వైరస్ కేసు కనపించినా సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు