కార్యకర్తలతో మాట్లాడాలంటే భారీ బహిరంగ సభ అక్కర్లేదు... టెక్నాలజీని ఉపయోగించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మాట్లాడవచ్చని నిరూపిస్తున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కోటి మంది బీజేపీ కార్యకర్తలు, వాలంటీర్లు, ఔత్సాహిక పౌరులతో నమో యాప్ ద్వారా ప్రధాని మోదీ మాట్లాడబోతున్నారు. ఇందుకోసం జిల్లాలు, మండలాలు, శక్రి కేంద్రాలు సహా 15,000 లొకేషన్లలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 28న మధ్యాహ్నం 12 గంటలకు ఈ వీడియో కాన్ఫరెన్స్ జరగబోతోంది. మండల కార్యాలయాలకు 20 కిలోమీటర్ల దూరంలో శక్తి కేంద్రాలున్నాయి. వీటిలో వీడియో కాన్ఫరెన్స్‌కి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
బీజేపీపాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గోనున్నారు. వీళ్లతోపాటూ సీనియర్ ఆఫీస్ బేరర్లు కూడా ముందుగానే నిర్ణయించిన ప్రదేశాల నుంచీ ఇందులో పాల్గొంటారు.
ఈ కార్యక్రమం నమోయాప్ తోపాటూ బీజేపీ ఫేస్ బుక్ పేజీలో, ట్విట్టర్లో, యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం కాబోతోంది. కొన్ని థర్డ్ పార్టీ యాప్స్, మీడియా ప్లేయర్లు కూడా దీన్ని లైవ్ వెబ్ కాస్ట్ ఇవ్వనున్నాయి. తద్వారా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లపై ఈ వీడియో కాన్ఫరెన్స్ 10 కోట్ల మందికి చేరే అవకాశాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Mobile App, Narendra modi