ప్రపంచంలోని చాలా మంది ప్రముఖులు ప్రత్యేకమైన డ్రెస్సింగ్ స్టైల్ (Dressing Style)ను ఫాలో అవుతారు. దాదాపు ఎల్లప్పుడూ ఒకే రకమైన దుస్తుల్లో కనిపిస్తారు. భారత ప్రధాని మోదీ (Indian PM Narendra Modi) డ్రెస్సింగ్ స్టైల్ కూడా విభిన్నంగా ఉంటుంది. ఆయన ధరించే జాకెట్లు గురించి చాలా సార్లు చర్చలు జరిగాయి. తాజాగా ఆయన ధరించిన ఓ జాకెట్ వైరల్ అవుతోంది. బుధవారం పార్లమెంటు సమావేశాలకు మోదీ లేత నీలం రంగు స్లీవ్‌లెస్ 'సద్రి' జాకెట్‌ను ధరించి వచ్చారు. ఈ జాకెట్‌ను ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేయగా వచ్చిన మెటీరియల్‌తో తయారు చేయడం విశేషం. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసేందుకు మోదీ ఈ జాకెట్ ధరించారు. దీంతో మరోసారి మోదీ జాకెట్ వైరల్ అవుతోంది.
* మోదీకి బహూకరించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
సోమవారం బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్(India Energy Week) అనే కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. 'అన్‌బాటిల్‌డ్(Unbottled)' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ జాకెట్‌ను ప్రధానికి బహూకరించింది. కంపెనీ ఇండోర్ సోలార్ కుకింగ్ సిస్టమ్, ట్విన్-కుక్‌టాప్ మోడల్‌ను కూడా మోదీ ఆవిష్కరించారు. ఈవెంట్ సందర్భంగా మోదీ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ సంతకం చేసిన అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు జెర్సీని అందుకున్నారు. ఈ జెర్సీని ప్రభుత్వ యాజమాన్యంలోని అర్జెంటీనా ఎనర్జీ కంపెనీ అయిన YPF ప్రెసిడెంట్ పాబ్లో గొంజాలెజ్ బహుమతిగా ఇచ్చారు.
* ఇంధన రంగంలో ఇండియా బెస్ట్
ఈవెంట్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు భారతదేశం కంటే మెరుగైన ప్రదేశం మరొకటి లేదని చెప్పారు. 21వ శతాబ్దంలో ప్రపంచం భవిష్యత్తును నిర్ణయించడంలో ఇంధన రంగం ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. కొత్త ఇంధన వనరులను అభివృద్ధి చేయడంలో, ఇంధన పరివర్తనలో భారతదేశం నేడు ముందుందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అన్ని వనరులు ఉన్నాయని, ఇంధన రంగంలో అపూర్వమైన అవకాశాలు లభిస్తున్నాయని మోదీ చెప్పారు.
ఇది కూడా చదవండి : మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం! రోదసీలోకి దూసుకెళ్లనున్న మూడు ఉపగ్రహాలు
* రీసైకిల్ ప్లాస్టిక్ నుంచి ఫ్యాషన్
మోదీ జాకెట్ తయారీ గురించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వివరించింది. వినియోగించిన ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి ఫ్యాబ్రిక్ తయారు చేశారు. ఈ ప్రాసెస్‌లో సేకరించిన పీఈటీ బాటిళ్లను కడగడం, ఆరబెట్టడం, చిన్న చిన్న ముక్కలుగా చేయడం వంటి దశలు ఉంటాయి. ఈ ముక్కలను వేడి చేసి, స్పిన్నరెట్ ద్వారా ప్రాసెస్ చేసినప్పుడు పాలిస్టర్ ప్రధానమైన ఫైబర్ వస్తుంది. క్రింపింగ్ మెషీన్ ద్వారా మెత్తటి, ఉన్ని ఆకృతిలోకి వస్తుంది.
ఈ పాలిస్టర్ ప్రధానమైన ఫైబర్‌ను ఈ పాలిస్టర్ ప్రధానమైన ఫైబర్‌ను తిప్పుతూ నూలును ఉత్పత్తి చేస్తారు. బట్టలు, బూట్ల కోసం ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసే ఇతర కంపెనీలతో ఈ ప్రక్రియ పోలి ఉంటుంది. టీ-షర్ట్‌ను తయారు చేయడానికి దాదాపు ఆరు రీసైకిల్ బాటిళ్లు, బాడీసూట్ చేయడానికి ఆరు, స్లీప్‌సూట్ చేయడానికి తొమ్మిది బాటిళ్లు, దుస్తులు తయారు చేయడానికి తొమ్మిది బాటిళ్లు అవసరమని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National News, Pm modi, PM Narendra Modi