హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Narendra Modi: కేదార్‌నాథ్‌లో ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

PM Narendra Modi: కేదార్‌నాథ్‌లో ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

కేదార్‌నాథ్‌లో ప్రధాని మోదీ

కేదార్‌నాథ్‌లో ప్రధాని మోదీ

PM Narendra modi at Kedarnath: ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని క్లోరైట్ స్కిస్ట్ అనే ప్రత్యేకమైన శిలతో రూపొందించారు. భీకర వర్షాలు, ఎండలతో పాటు ఎలాంటి ప్రకృతి వైపరిత్యం తలెత్తినా తట్టుకునేలా నిర్మించారు. మైసూర్‌కు చెందిన ప్రముఖ శిల్పి యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తయారుచేశారు.

ఇంకా చదవండి ...

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కేదార్‌నాథ్‌ (Kedarnath)లో పర్యటిస్తున్నారు. కేదార్‌నాథుడి క్షేత్రంలో జగద్గురు ఆది శంకరాచార్యుల (Adi ahankara)విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కారీక మాసం ప్రారంభం సందర్భంగా కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అనంతరం ఆది శంకరాచర్యాల విగ్రహాన్ని  ఆయన ఆవిష్కరించారు. 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆది శంకరాచార్యుల సమాధితో పాటు ఎన్నో కట్టడాలు కొట్టుకుపోయాయి. వాటిని కేంద్రం పునర్నిర్మిస్తోంది. అందులో భాగంగానే ఆది శంకరాచార్యుల సమాధికి మరమ్మతులు చేశారు. అక్కడే ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 12 ఫీట్ల పొడవు..35 టన్నుల బరువున్న.. విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా ఆవిష్కరించారు.


ప్రధాని పర్యటన నేపథ్యంలో కేదార్‌నాథ్ ఆలయాన్ని 800 కిలోల పూలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. భద్రతా బలగాలను మోహరించి పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. విగ్రహావిష్కరణ అనంతరం.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ప్రధాని మోదీ. అష్టపతి ఘాట్‌లో 130 కోట్ల రూపాయలతో చేపట్టిన సరస్వతి రిటైనింగ్ వాల్, తీర్థ పురోహిత్‌ సముదాయాలు, గరుడ్ చట్టి బ్రిడ్జ్‌, మందాకినీ రిటైనింగ్ వాల్ ప్రాజెక్టును ప్రారంభించారు.


Diwali special : టపాసులు కాల్చడం కాదు.. అక్కడ కొట్టుకోవడమే దీపావళీ స్పెషల్..

ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని క్లోరైట్ స్కిస్ట్ అనే ప్రత్యేకమైన శిలతో రూపొందించారు. భీకర వర్షాలు, ఎండలతో పాటు ఎలాంటి ప్రకృతి వైపరిత్యం తలెత్తినా తట్టుకునేలా నిర్మించారు. మైసూర్‌కు చెందిన ప్రముఖ శిల్పి యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తయారుచేశారు. తన కుమారుడి సహకారంతో విగ్రహాన్ని రూపొందించారు. 2020 నుంచి ఆది శంకరాచార్యుల విగ్రహ తయారీలో ఉన్నారు యోగిరాజ్. ప్రధాని రాక సందర్భంగా కొబ్బరి నీళ్లతో పాలిష్ చేశారు. దాంతో ఆది శంకరాచార్యుల విగ్రహం మరింతగా మెరుపును సంతరించుకుంది.

Diwali Celebrations: ఆ ప్రాంతంతో దీపావళి వేడుకలు ఐదు రోజులు.. కాకి,కుక్క,ఎద్దులకు పూజ

ఆది శంకరాచార్యులు... హిందూ మతాన్ని ఉద్దరించిన మహనీయుడు. అతి పిన్న వయసులోనే సన్యాసిగా మారారు. జమ్మూకాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన పర్యటించారు. అద్వైత సిద్ధాంతాన్ని ఎలుగెత్తిచాటారు. అందరూ సమానమేనని ప్రచారం చేసిన వేదాంతవేత్త. కేరళలో పుట్టిన ఆయన కేదార్‌నాథ్‌లో శివైక్యం చెందారు. ఆ ప్రాంతంలోనే శంకరాచార్యుల సమాధిని పునర్నిర్మించారు. ఆది శంకరాచార్యుల విగ్రహావిష్కరణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న శంకర్ మఠాల్లో బీజేపీ నేతలు పూజలు చేస్తున్నారు.

First published:

Tags: Kedarnath, Narendra modi, PM Narendra Modi, Uttarakhand

ఉత్తమ కథలు