భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఈరోజు తన 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరుతపులులను ఇండియాలో ప్రవేశపెట్టనున్నారు. అయితే చిరుతలను తీసుకొచ్చే ప్రోగ్రామ్ కంటే మరొక దానికి ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. అదేంటంటే, మోదీ ఈరోజు లాజిస్టిక్స్ వ్యయాన్ని జీడీపీలో 8 శాతానికి తగ్గించే లక్ష్యంతో భారత నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ (National Logistics Policy)ని ఆవిష్కరిస్తున్నారు. నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో లాంచ్ చేయనున్నారు.
* పాలసీ లక్ష్యం
దేశీయ, ఎగుమతి మార్కెట్లలో భారతీయ వస్తువుల పోటీతత్వాన్ని మెరుగుపరచాలంటే దేశంలో లాజిస్టిక్స్ ధరను తగ్గించడం అత్యవసరం. తగ్గిన లాజిస్టిక్స్ ఖర్చుతో వివిధ రంగాలు లాభపడతాయి. అయితే మోదీ ప్రారంభించనున్న పాలసీ అనేది లాజిస్టిక్స్ రంగానికి గేమ్ ఛేంజర్ అవుతుందని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. మెరుగైన ఆర్థిక కార్యకలాపాలతో భారతదేశాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చడం, 2030 నాటికి గ్లోబల్ బెంచ్‌మార్క్‌లను సాధించడం కొత్త నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ లక్ష్యమని ఆ అధికారి వెల్లడించారు.
లాజిస్టిక్స్ ధరను ప్రస్తుతమున్న 13 శాతం నుంచి 8 శాతానికి తగ్గించడమే ఈ పాలసీ లక్ష్యం. అలానే లాజిస్టిక్స్ పర్ఫామెన్స్ ఇండెక్స్ (Logistics Performance Index)ను మెరుగుపరచాలని, గ్లోబల్ పొజిషనింగ్‌లో టాప్ 25 దేశాలలో ఒకటిగా భారత్‌ను నిలబెట్టాలని ఇది ధ్యేయంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.
* ఎలా పని చేస్తుంది?
దేశంలో లాజిస్టిక్స్ ధరను తగ్గించడానికి, కొత్త విధానంలో గిడ్డంగుల ధరను తగ్గిస్తుంది. సప్లై చైన్ రిలయబిలిటీ మెరుగుదలలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. విశాలమైన స్థలం, డిజిటలైజేషన్, ఆటోమేషన్‌తో గిడ్డంగుల ఏర్పాటుపై ఈ పాలసీ ఫోకస్ పెడుతుంది. ఈ పాలసీతో డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడం, మెరుగైన ట్రాక్, ట్రేస్ మెకానిజమ్స్, ఇన్వెంటరీని రియల్ టైమ్ ట్రాకింగ్ చేయడం ద్వారా ఇన్వెంటరీ నిర్వహణ వ్యయం తగ్గుతుందని భావిస్తున్నారు.
* లాభాలు ఏంటి?
నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ అనేది స్ట్రీమ్‌లైనింగ్ ప్రాసెసెస్, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్, స్కిల్ డెవలప్‌మెంట్, హయ్యెర్ ఎడ్యుకేషన్‌లో మెయిన్‌స్ట్రీమింగ్ లాజిస్టిక్స్, తగిన టెక్నాలజీలను స్వీకరించడం ద్వారా సర్వీసులు, హ్యూమన్ రిసోర్స్ సామర్థ్యాన్ని మెరుగుపరిచే భాగాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. లాజిస్టిక్స్ సెక్టార్‌లో 22 మిలియన్ల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అయితే ఈ సర్వీసులలో క్వాలిటీ, ఎఫిషియన్సీ పెంచడానికి ఈ ఉద్యోగుల స్కిల్ డెవలప్‌మెంట్‌లో NLP సహకరిస్తుంది.
ఈ పాలసీ కింద సమర్థవంతమైన లాజిస్టిక్స్ పర్యావరణ వ్యవస్థ కోసం డేటా ఆధారిత డెసిషన్ సపోర్ట్ మెకానిజం రూపొందించడం... లాజిస్టిక్స్ సమస్యలను సరైన పద్ధతిలో సకాలంలో పరిష్కరించడం కోసం ప్రభుత్వం, ప్రైవేట్ రంగం నుంచి లాజిస్టిక్స్ సెక్టార్ వాటాదారులను ఒకచోట చేర్చడంపై కూడా ప్రయత్నాలు జరుగుతాయి.
ఇది కూడా చదవండి : మీకు ప్రధాని మోదీ గురించి ఈ విషయాలు తెలుసా..?
చిన్న సన్నకారు వ్యాపారాలు, వ్యవసాయ, దాని అనుబంధ రంగాలు, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల పోటీతత్వాన్ని పెంపొందించడానికి కొత్త పాలసీ హెల్ప్ అవుతుంది. ఈ పాలసీ వల్ల ఆర్థిక కార్యకలాపాలు మెరుగు పడతాయి. మార్కెట్లు విస్తరిస్తాయి. ప్రపంచ వాణిజ్యంలో అధిక వాటా మన దేశందే అవుతుంది. ఎక్కువ అంచనా, పారదర్శకత, విశ్వసనీయతతో, లాజిస్టిక్స్ ఖర్చు తగ్గుతుంది. అలానే సరఫరా గొలుసులో వ్యర్థాలు తగ్గుతాయి.
* ఎనిమిది నెలలుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం
గత ఎనిమిది నెలలుగా ప్రభుత్వం ఈ పాలసీ నేను ప్రవేశపెట్టేందుకు కృషి చేసింది. దేశంలోని 14 రాష్ట్రాలు తమ 'స్టేట్ లాజిస్టిక్స్ పాలసీ'ని రూపొందించేలా ప్రోత్సహించింది. మరో 11 రాష్ట్రాలను కూడా దాదాపు ఒప్పించింది. ఎన్‌ఎల్‌పీ మెరుగైన దృష్టితో సమర్థవంతమైన లాజిస్టిక్‌ల కోసం కీలకమైన పర్యావరణ వ్యవస్థలోని అన్ని ఉప-రంగాల కోసం ఓవర్‌కింగ్ ఇంటర్‌డిసిప్లినరీ, క్రాస్ సెక్టోరల్, మల్టీ-జ్యూరిస్డిక్షనల్ కాంప్రెహెన్సివ్ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ని స్పష్టంగా నిర్ణయిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Logistics, Narendra Modi Birthday, National News, PM Narendra Modi