హ్యాకర్స్ సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలపై ఫోకస్ చేస్తున్నారు. కొన్ని రోజుల కిందట ప్రపంచ వ్యాప్తంగా టాప్ టెక్ దిగ్గజాలు, బిలియనీర్ల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్ కావడం తెలిసిందే. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి హ్యాకర్లు షాకిచ్చారు.
హ్యాకర్స్ సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలపై (twitter account) ఫోకస్ చేస్తున్నారు. కొన్ని రోజుల కిందట ప్రపంచ వ్యాప్తంగా టాప్ టెక్ దిగ్గజాలు, బిలియనీర్ల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్ కావడం తెలిసిందే. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి హ్యాకర్లు షాకిచ్చారు. నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ (Pm Narendra modi twitter account)ను ఆదివారం ఉదయం 2 గంటల ప్రాంతంలో హ్యాకర్స్ (hackers) ఆధీనంలోకి తీసుకున్నారు . ఈ విషయాన్ని (Narendra modi twitter account hack) పీఎంవో (PMO) తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో తెలియజేసింది. హ్యాకింగ్ విషయాన్ని ట్విటర్ (twitter)కు తెలియజేశామని పీఎంవో పేర్కొంది. వెంటనే ట్విటర్ ప్రధాన మంత్రి ఖాతాకు భద్రత కల్పించిందని తెలిపింది. అయితే హ్యాకర్స్ నరేంద్ర మోదీ ట్విటర్ అకౌంట్ నుంచి ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టు కూడా క్రిప్టో కరెన్సీ గురించి..
పోస్టులో ఏముందంటే..
ఆదివారం 2 గంటల ప్రాంతంలో ట్విటర్లో నరేంద్రమోదీ ఖాతా నుంచి హ్యాకర్లు ఒక సందేశం పెట్టారు. బిట్ కాయిన్లను ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిందని ఆ పోస్టులో తెలిపారు. అంతేకాకుండా బిట్కాయిన్ల (Bitcoins) కోసం టెండర్లను ప్రభుత్వం పిలిచిందని తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా 500 BTC (బిట్ కాయిన్లు)లు కొనుగోలు చేసిందని, దేశంలోని ప్రజలందరికీ బిట్కాయిన్లు పంచబోతుందంటూ హ్యాకర్స్ ప్రధానమంత్రి ట్విటర్లో పోస్టు పెట్టడం సంచలనం రేకెత్తించింది.
హ్యాకర్స్ పెట్టిన పోస్టు..
దీంతో అప్రమత్తమైన పీఎంవో తన ట్విట్టర్ హ్యాండిల్ (PMO twitter)లో.. " PM @narendramodi ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయం ట్విట్టర్‌కు తెలియజేయడంతో వెంటనే మోదీ ఖాతాకు భద్రత కల్పించారు. ఖాతా హ్యాక్ (account hack) అయిన ఆ సమయంలో ఏదైనా సందేశం వస్తే వదిలివేయండి” అని పేర్కొంది.
The Twitter handle of PM @narendramodi was very briefly compromised. The matter was escalated to Twitter and the account has been immediately secured.
In the brief period that the account was compromised, any Tweet shared must be ignored.
కాగా, గతంలోనే మోదీ ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. జాన్ విక్ అనే వ్యక్తి ఈ హ్యాకింగ్‌కు పాల్పడ్డాడు. ఆ సమయంలో క్రిప్టో కరెన్సీ రూపంలో ప్రధాన మంత్రి సహాయనిధికి విరాళాలు ఇవ్వాలంటూ గత కొన్ని రోజులుగా ట్వీట్లు చేశారు. దీంతో అనుమానమొచ్చి చెక్ చేస్తే ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ (Narendra modi twitter account hack) అయినట్లు గుర్తించారు.
Twitter account of PM Modi's personal website hacked
Bitcoin గడిచిన కొన్ని నెలలుగా భారత్‌లో ఈ రంగం నిశ్శబ్ధంగా ఎదుగుతోంది. డిజిటల్ టొకెన్లను కరెన్సీగా గుర్తించకపోయినా దానిపై విపరీతంగా క్రేజ్ పెరుగుతుండటంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవలె ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టో కరెన్సీ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. మరో వైపుక్రిప్టోకరెన్సీని (Bitcoin) పూర్తిగా నిషేధించడం కన్నా మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందకుండా క్రిప్టోకరెన్సీపై (Bitcoin) బలమైన నియంత్రణా ఉండాలని వివిధ విభాగాలు కోరుతున్నాయి. దానిని నిశితంగా పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటుందని పలువురు అనుకుంటున్నారు. అయితే ఈ బిట్ కాయిన్లను ప్రభుత్వం ఆమోదించినట్లు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్టు వెలువడటం సంచలనం రేకెత్తించింది. ఆదివారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఈ పోస్టు వెలువడటంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దీనిపై పీఎంవో స్పందించే వరకు విషయం ఎవరికీ అర్థం కాలేదు. ఇదంతా హ్యాకర్ల పని (Narendra modi twitter account hack) అని తెలియజేసింది పీఎంవో.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.