PM Narendra Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం అందుకోనున్నారు. ప్రపంచ దేశాల అధినేతల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి (Narendra Modi) మరో గౌరవం దక్కింది. ఈయనకు ప్రతిష్ఠాత్మక లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించనున్నారు. ఈ అవార్డు అందుకోనున్న మొదటి వ్యక్తి నరేంద్ర మోదీ కావడం విశేషం. ఈ అవార్డును దీనానాథ్ మంగేష్కర్ వర్థంతి సందర్భంగా ప్రతి యేడాది ఏప్రిల్ 24న ప్రధాన మంత్రికి ఇవ్వనున్నారు. ధేశ ప్రజా సేవల రంగంలో చేసిన కృషికి గాను ఈ అవార్డును అందుకోనున్నాడు. ఈ అవార్డును కీర్తి శేషులు గాన కోకిల లతా మంగేష్కర్ గౌరవార్ధం దీనానాథ్ అవార్డును లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుగా మార్చారు. లతాజీ ఈ యేడాది ఫిబ్రవరి 6వ తేదిన అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా.
మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ ఛారిటబుల్ ట్రస్ట్ .. ప్రతి యేడాది ఒకిరని ఈ అవార్డుతో సత్కరిస్తూ ఉంటారట. ఏదైనా ప్రజా సేవ, దేశ సేవా, మరియు సైన్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో దేశ అభ్యున్నతికి అద్భుతమైన కృషి చేసిన వారికి ఈ అవార్డును ప్రధానం చేస్తూ ఉన్నారు.
పీఎం నరేంద్ర మోదీ ప్రజా సేవల రంగంలో చేసిన కృషిగాను ఈ అవార్డును ఇవ్వనున్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌ను విశ్వగురువుగా నిలిపారు. అంతేకాదు యోగాను అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ఆమోదం పొందేలా చేయడంలో కీలక భూమిక పోషించారు. అంతేకాదు ప్రపంచ అగ్ర దేశాలైన అమెరికా, రష్యాలు సైతం మన దేశపు మాటను కాదనలేని స్థితికి తీసుకొచ్చారు.
ఇప్పటికే భారత ప్రధాన మంత్రి ఖాతాలో అదే అమెరికా అత్యున్నత అవార్డు ‘లెజియన్ ఆఫ్ మెరిట్’ అవార్డ్‌ను చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇది వరకు కూడా చాలా దేశాల నుంచి ఆయా దేశాల బెస్ట్ అవార్డులు వచ్చాయి. 2016లో సౌదీ అరేబియా... అబ్దులాజిజ్ అల్ సౌద్ అవార్డు, అఫ్గానిస్థాన్ నుంచి అమీర్ అబ్దుల్లా ఖాన్ అవార్డు, 2018లో సియోల్ పీస్ ప్రైజ్, రష్యా నుంచి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోజిల్ అవార్డు, UAE నుంచి జాయెద్ మెడల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుకున్నారు. తాజాగా లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును అందుకోనున్నారు. ఇక లతాజీ కన్నుమూసిన సమయంలో ప్రధాన నరేంద్ర మోదీ స్వయంగా ఆమె పార్ధివ దేహానికి నివాళులు అర్పించడానికి ముంబైకి విచ్చేసిన సంగతి తెలిసిందే కదా.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.