PM Modi Team: ప్రధాని మోదీ టీమ్‌లో సోనియాగాంధీ, టెండుల్కర్... ఇంకా...

ప్రధాని మోదీ టీమ్‌లో సోనియాగాంధీ, టెండుల్కర్... (File Images)

PM Narendra Modi Team: ఇది నిజంగా ఆశ్చర్యమే. ప్రధాని మోదీ టీమ్‌లో సోనియా గాంధీ ఎందుకుంటారు. అనే డౌట్ రావచ్చు. పూర్తి వివరాల్ని స్ట్రైట్‌గా, ఫటాఫట్ తెలుసుకుందాం.

 • Share this:
  PM Modi Team: ప్రధానమంత్రి నరేంద్రమోదీ... ఓ హై లెవెల్ కమిటీకి హెడ్‌గా ఉండబోతున్నారు. ఈ కమిటీలో 259 మంది ప్రముఖులు ఉంటారు. వీరు రకరకాల రంగాల్లో నిష్ణాతులు. వీరిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాత, ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ బాబ్డే తదితరులు ఉంటారు. ఈ సంవత్సరం 75వ స్వాతంత్ర్య దినోత్సవం రాబోతున్న సందర్భంగా... కేంద్రం ఈ కమిటీని వేసింది. ఇంకా ఇందులో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ఆర్థిక వేత్త అమర్త్యసేన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, యోగా గురువు బాబా రాందేవ్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ రాజకీయ నేతలు కూడా ప్యానెల్ సభ్యులుగా ఉంటారు.

  "75వ స్వాతంత్ర్య దినోత్సవానికి ఎలాంటి ఏర్పాట్లు చెయ్యాలో... జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏం చెయ్యాలో ఈ కమిటీ నిర్ణయాలు తీసుకొని... మార్గదర్శకాలు జారీ చేస్తుంది." అని సాస్కృతిక శాఖ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

  ఈ దినోత్సవాన్ని అద్భుతంగా చెయ్యాలని కేంద్రం ఎప్పటి నుంచో అనుకుంటోంది. రకరకాల కార్యక్రమాలతోపాటూ... ఎగ్జిబిషన్లు పెట్టాలనుకుంది, ర్యాలీలు, టూరిజం కార్యక్రమాలు కూడా జరపాలనుకుంటోంది. మార్చి 12న గుజరాత్‌లో వీటికి శ్రీకారం చుట్టబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అప్పుడే ఎందుకంటే... దండి సత్యాగ్రహం జరిగి... ఆ రోజుకు 91 సంవత్సరాలు అవుతుంది. ఇక ఆ రోజు నుంచి స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు మొదలవుతాయన్నమాట. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్, సుభాష్ చంద్ర బోస్ పటేల్ వంటి వారికి సంబంధించిన ఎగ్జిబిషన్లు కూడా ఉంటాయి. వీటిని దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి... టీవీల్లో ప్రసారం చేస్తారు. ఆజాదీ కా అమృత మహోత్సవం అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. అది 75 వారాలు కొనసాగుతుంది. అది ఆగస్ట్ 15, 2022 కంటే ముందే మొదలై... ఆగస్ట్ 15, 2023కి ముగుస్తుంది.

  మీకు తెలిసే ఉంటుంది. బ్రిటిష్ పాలకులు ఉప్పుపై పన్ను వేసినందుకు నిరసనగా... 1930లో మహాత్మాగాంధీ... దండి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అది ఏప్రిల్ 5న ముగిసింది. ఆ తర్వాత దేశ ప్రజల్లో స్వాతంత్ర పోరాట పటిమ మరింత పెరిగింది. అందుకే... కేంద్రం మార్చి 12 నుంచి 25 రోజుల పాటూ కొన్ని వేడుకలు జరపబోతోంది. ఇప్పుడు రాష్ట్రాల సీఎస్‌లు తమ రాష్ట్రంలోని మూడు చారిత్రక ప్రదేశాల్ని గుర్తించి కేంద్రానికి చెప్పాలి. అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి.

  ఇది కూడా చదవండి: Horoscope Today: మార్చి 6 రాశి ఫలాలు... శుభ సంకల్పాలు సిద్ధించే సమయం

  ఇలా మొత్తం 75 కేంద్రాల్ని కేంద్రం ఎంపిక చేస్తుంది. యూత్ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి యూత్ క్లబ్బులు, నేషనల్ సర్వీస్ స్కీమ్, నేషనల్ కాడెట్ కార్ప్స్ (NCC) వాలంటీర్లు సైకిల్ ర్యాలీలు చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే... 75వ స్వాతంత్ర్య దినోత్సవం... ఇదివరకూ ఎప్పుడూ లేనంత గ్రాండ్‌గా జరగనుంది.
  Published by:Krishna Kumar N
  First published: