Diwali 2019 : నేడు కాశ్మీర్‌కు ప్రధాని మోదీ... సైనికులతో కలిసి దీపావళి

Diwali 2019 : ప్రధాని నరేంద్ర మోదీ ఏటా దీపావళిని సైనికులతో కలిసి జరుపుకోవడం ఆనవాయితీగా చేసుకున్నారు. ఈసారి కూడా అదే నిర్ణయం తీసుకున్నారు.

news18-telugu
Updated: October 27, 2019, 7:36 AM IST
Diwali 2019 : నేడు కాశ్మీర్‌కు ప్రధాని మోదీ... సైనికులతో కలిసి దీపావళి
నరేద్ర మోదీ (File - credit - twitter - Kashyap Patel)
  • Share this:
PM Modi and Diwali : దీపావళిని అందరిలా రొటీన్‌గా కాకుండా... భారత సైన్యంతో జరుపుకోనుండటం ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకత. ఇందుకోసం ఆయన... ఇవాళ జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దు స్థావరాలకు వెళ్లే అవకాశాలున్నాయి. జమ్మూకాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి హోదాను తొలగించిన తర్వాత తొలిసారిగా మోదీ కాశ్మీర్ వెళ్తున్నారు. ఇదివరకు మోదీ... పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాల్లో ఉండే సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. అలాగే ఇదివరకు ఉత్తరాఖండ్‌లోని సరిహద్దు స్థావరాల్ని సందర్శించారు. ఈసారి కూడా సైన్యంతో దీపావళి జరుపుకుంటూ... సరిహద్దుల్ని పరిశీలిస్తారని తెలిసింది. ఈ సందర్భంగా ఈమధ్య POKలో భారత సైన్యం చేసిన ఆపరేషన్‌పై ప్రధానికి వివరించే అవకాశాలున్నాయి.

2014లో తొలిసారి ప్రధాని అయిన మోదీ... ఆ ఏడాది దీపావళిని ప్రపంచంలో ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ గ్లేషియర్ బేస్ క్యాంప్‌లో జరుపుకున్నారు. అప్పటి నుంచీ ఏటా ఇలా సైన్యంతో దీపావళి జరుపుకుంటూ... వారికి స్వీట్లు పంచిపెడుతున్నారు మోదీ. ఐతే... ఏటా ఆయన ఎక్కడ జరుపుకుంటున్నదీ ముందుగా వెల్లడించట్లేదు. ఈసారి కూడా అధికారికంగా ప్రకటన రాలేదు.

 

Pics : లవ్లీ బ్యూటీ తరుణీ సింగ్ క్యూట్ ఫొటోస్







ఇవి కూడా చదవండి :

Diwali 2019 : దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు... అద్భుత దృశ్యాలు

Loading...

Diwali 2019 : ప్రపంచవ్యాప్తంగా దీపావళి సంబరాలు... చూసితీరాల్సిందే...


Diwali 2019 : అంతటా దీపావళి సందడి... సెలబ్రిటీల విషెస్

నేడు హర్యానా సీఎంగా ఖట్టర్, డిప్యూటీ సీఎంగా దుష్యంత్ ప్రమాణ స్వీకారం

Diwali 2019 : దీపావళికి దీపాలు ఎందుకు వెలిగిస్తారు... ఇదీ పండుగ ప్రాసస్థ్యం
First published: October 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...