PM Narendra Modi: నేడు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగం... కీలక ప్రకటన?

నేడు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగం (File image credit - Twitter)

PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ... ఇలా జాతిని ఉద్దేశించి ప్రసంగించే సందర్భాలు తక్కువే. ఇప్పుడు అలాంటి సందర్భం వస్తోంది. మరి ఆయన ఏం చెబుతారు... ఏ సంచలన ప్రకటన చేయబోతున్నారో తెలుసుకుందాం.

  • Share this:
    PM Modi message: సాధారణంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి వారు... ఆగస్ట్ 15, గణతంత్ర దినోత్సవాలప్పుడే జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన అంశాలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ప్రసంగాలు చేస్తారు. ఇదివరకు నోట్ల రద్దు ప్రకటన చేయడం కోసం... ప్రధానమంత్రి నరేంద్రమోదీ... ఇలాగే జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత మరో సందర్భంలో... గతేడాది మార్చిలో దేశవ్యాప్త లాక్‌డౌన్ విధిస్తున్నట్లు చెప్పడానికి ప్రసంగించారు. ఇవాళ మరోసారి జాతిని ఉద్దేశించి సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించబోతున్నట్లు ప్రధాని కార్యాలయం స్వయంగా తెలుపుతూ ట్విట్టర్ ద్వారా ఓ చిన్న ట్వీట్ ఇచ్చింది.

    ఈ ప్రకటన రాగానే దేశ ప్రజల్లో ఈ అంశంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఒక్కటైతే నిజం... ఇప్పుడు దేశవ్యాప్త లాక్‌డౌన్ పెడతామని మాత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పరు. ఎందుకంటే... ఇండియాలో డైలీ కరోనా కేసులు నెల రోజుల్లోనే 4 లక్షల నుంచి లక్షకు తగ్గిపోయాయి. అందువల్ల అలాంటి ప్రకటన రాదు. మరి ప్రధాని నరేంద్ర మోదీ ఏ సందేశం ఇస్తారు అనే దానిపై హాట్ టాపిక్ నడుస్తోంది.


    కరోనాపైనే ప్రసంగం?:
    ఎనలిస్టుల ప్రకారం... కరోనాపైనే ప్రధానమంత్రి మాట్లాడతారని తెలుస్తోంది. ఏప్రిల్, మేలో కరోనా ఎంతలా దేశాన్ని నాశనం చేసిందో ప్రంసంగంలో చెబుతారనీ... అలాగే... వ్యాక్సినేషన్ ప్రక్రియపై మాట్లాడతారని తెలుస్తోంది. దేశ ప్రజలంతా... థర్డ్ వేవ్‌ని ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని కూడా కోరతారని కొందరు అంటున్నారు.

    వ్యాక్సినేషన్‌ సమస్య:
    వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇండియాలో తలనొప్పిగా మారింది. రాష్ట్రాల ప్రభుత్వాలేమో... కేంద్రం తమకు సరిపడా వ్యాక్సిన్లు ఇవ్వట్లేదు అంటున్నాయి. కేంద్రమేమో... తమకు వచ్చే వాటిలో... సగం తామే రాష్ట్రాలకు ఇచ్చి... ఉచితంగా 45 ఏళ్లు దాటిన వారికి వేయిస్తున్నామని అంటోంది. ఇదో ఎడతెగని చర్చలా మారింది. యువతేమో... తమకు వ్యాక్సిన్ ఉచితంగా వేయిస్తే బాగుండని చూస్తున్నారు. ఏపీ, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని చెప్పినా... అసలు ఆ రాష్ట్రాలకు వ్యాక్సిన్లు సరిపడా రావట్లేదు. ఈ అంశాలపై మోదీ ప్రధానంగా మాట్లాడతారనీ... యువత అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరతారని తెలుస్తోంది.

    విదేశాలకు పంపడమే సమస్యైందా?
    వ్యాక్సిన్ మైత్రి పేరుతో కేంద్ర ప్రభుత్వం 70కి పైగా దేశాలకు వ్యాక్సిన్లను పంపింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తప్పుపడుతున్నాయి. ముందు దేశ ప్రజలకు ఇవ్వకుండా విదేశాలకు ఎక్కువ ఇచ్చేశారనీ... దాని వల్ల దేశంలో సెకండ్ వేవ్ బీభత్సంగా వచ్చేసిందని ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను కేంద్రం ఖండిస్తోంది. వ్యాక్సిన్లు పంపడం వల్లే... ఆయా దేశాలు ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, మందుల వంటివి ఇండియాకు పంపిస్తున్నాయని అంటోంది.

    ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ రాశులు విషపూరితం... స్వార్థంతో నిండిన మనస్తత్వం

    ఇలా మొత్తంగా ప్రధానమంత్రి ఏం చెబుతారన్నది సస్పెన్స్‌గా మారింది. సాయంత్రం 5 ఎప్పుడవుతుందా అని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: