PM Modi Tweets: దుబ్బాక, బీహార్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు...

PM Narendra Modi Tweets: నిన్న దేశవ్యాప్తంగా బీజేహీ హవా కనిపించడం ఒక ఎత్తైతే... దుబ్బాకలో బీజేపీ గెలవడం మరో ఎత్తుగా కేంద్రం చూస్తోందా? నెక్ట్స్ ఏం చేయబోతోంది?

news18-telugu
Updated: November 11, 2020, 6:27 AM IST
PM Modi Tweets: దుబ్బాక, బీహార్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు...
PM Modi Tweets: దుబ్బాక, బీహార్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు... (credit - twitter)
  • Share this:
PM Modi Tweets: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తన మార్క్ చూపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... దుబ్బాక నియోజకవర్గంలో... బీజేపీ గెలవడంపై ప్రత్యేక హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ట్వీట్ ద్వారా స్పందించిన ఆయన... బీజేపీని గెలిపించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు (Thanks) చెప్పారు. "ఇదో చరిత్రాత్మక విజయం. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మాకు ఇదో బలం. బీజేపీ కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. బీజేపీ అభివృద్ధి అజెండాను ముందుకు తీసుకెళ్తూ మంచి ఫలితాలిస్తూ శ్రమిస్తున్న వారి ప్రయత్నాలను మెచ్చుకుంటున్నాను." అని ప్రధాని మోదీ తన ట్వీట్ ద్వారా తెలిపారు. ఇప్పటికే దుబ్బాక విజయంతో... తెలంగాణలో బీజేపీకి కొండంత బలం వచ్చినట్లైంది. తాజా ట్వీట్.. పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపడం ఖాయం.


బీహార్ ఎన్నికల్లో NDA విజయంపైనా ప్రధాని మోదీ స్పందించారు. ప్రజల ఆశీర్వాదంతో మరోసారి అద్భుత విజయం సాధించామని అన్నారు. NDA కార్యకర్తల పట్టుదల, నిబద్ధత... స్పూర్తి దాయకమైనవి అని మెచ్చుకున్నారు. కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పిన మోదీ... బీహార్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.


NDA మంత్రమైన సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ (అందరితో, అందరి అభివృద్ధి కోసం, అందరి నమ్మకంతో)ను బీహార్ లోని పేదలు, రైతులు, కార్మికులు, వ్యాపారులు... అన్ని రంగాల వారూ స్వాగతించారని మోదీ అన్నారు. ఇకపైనా నిబద్ధతతో నిరంతరం పనిచేస్తామని మాట ఇస్తున్నానన్న మోదీ... ప్రతి ప్రాంతం, ప్రతి ఒక్కరూ.... సంతులిత అభివృద్ధి చెందేలా చేస్తామని ట్వీట్ ద్వారా తెలిపారు.


బీహార్‌ను సాధికార రాష్ట్రంగా మలచడంలో తమ పాత్ర కీలకం అని నిరూపిస్తూ... బీహార్ సోదరీమణులు, కూతుర్లూ... ఈసారి రికార్డు స్థాయిలో ఓటు వేశారన్న మోదీ... కొన్నేళ్లుగా బీహార్ కోసం పాటుపడుతున్న NDAకి మరోసారి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతృప్తి చెందుతున్నామన్నారు. ఈ విజయం తమలో మరింత నమ్మకాన్ని పెంచిందన్నారు.


బీహార్‌ను సాధికార రాష్ట్రంగా మార్చేందుకు కొత్త దశాబ్దం మొదలయ్యేలా బీహార్ యువత రోడ్ మ్యాప్ ఇచ్చారన్న మోదీ... తమ శక్తి సామర్ధ్యాలను బీహార్ యువత గుర్తించారని అన్నారు. యూత్ ఫుల్ ఎనర్జీతో NDA మరింత హార్డ్ వర్క్ చేస్తుందని అన్నారు.


ప్రజాస్వామ్య బలాన్ని బీహార్ ఫలితం ప్రపంచానికి చాటిందన్న మోదీ... ప్రజాస్వామ్యం మరింత బలపడిందన్నారు. అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారని తన వరుస ట్వీట్లలో ప్రధాని మోదీ తెలిపారు.
Published by: Krishna Kumar N
First published: November 11, 2020, 6:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading