Narendra Modi: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో 100 కోట్ల మైలురాయి.. మొదట్లో తమను అనుమానించారన్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ (Image:ANI)

మేడ్‌ ఇన్‌ ఇండియా వ్యాక్సిన్లు (made in India vaccines), ఒక కీలకమైన సంపూర్ణ మార్పు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు . వంద కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించిన సందర్భంగా  ప్రధాని కొన్ని అంశాలపై మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే

  • Share this:
వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన తొమ్మిది నెలల సమయంలోనే అక్టోబర్‌ 21 నాటికి భారతదేశంలో (India) 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు (100 crore vaccine doses) పూర్తయ్యాయి. 2020లో ఆందోళనతో మొదలైన ప్రయాణానికి హామీ లభించడంతో ప్రపంచంలోనే అతి భారీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టి భారత్‌ శక్తిమంతంగా ఎదిగింది. సమాజంలోని బహుళ వర్గాలను ఇందులో మమేకం చేయడం నిజంగా భగీరథ ప్రయత్నమే. అందరి విశ్వాసం (trust) పొందడం, పరిమాణం, సుస్థిరమైన వేగాన్ని కొనసాగించడం ఆషామాషీ వ్యవహారం కాదు. అపనమ్మకం, భయాందోళనలు సృష్టించినా వాటికి వెరవకుండా వ్యాక్సిన్‌ (vaccine)పై ప్రజలు ఏర్పరుచుకున్న విశ్వాసం, దాని కోసం అనుసరించిన ప్రక్రియ ఈ విజయానికి కారణం. కేవలం విదేశీ బ్రాండ్లను (foreign brands) మాత్రమే నమ్మేవాళ్లు కొందరుంటారు. కానీ భారతీయులంతా ఏకగ్రీవంగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను విశ్వసించారు. మేడ్‌ ఇన్‌ ఇండియా వ్యాక్సిన్లు (made in India vaccines), ఒక కీలకమైన సంపూర్ణ మార్పు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు . వంద కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించిన సందర్భంగా  ప్రధాని కొన్ని అంశాలపై మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఒక్కరి కోసం అందరు, అందరి కోసం ఒక్కరు ...

ఒక లక్ష్య సాధన కోసం ప్రజాభాగస్వామ్యం ఉండి ప్రజలు, ప్రభుత్వమూ కలిసి పనిచేస్తే ఎలాంటి ఫలితాలు (results) సాధించవచ్చనేదానికి పరిపూర్ణ ఉదాహరణ భారత్‌ చేపట్టిన వ్యాక్సిన్‌ కార్యక్రమం. 130 కోట్లు మంది భారతీయుల సామర్ధ్యాన్ని ప్రారంభంలో చాలా మంది శంకించారు. అందరికి వ్యాక్సిన్లు అంటే 3-4 ఏళ్లు పడుతుందని కొందరు అనుమానిస్తే, మరికొందరు అసలు వ్యాక్సిన్‌ వేసుకోడానికి జనాలు ముందుకు వస్తారా అని భయపడ్డారు. తీవ్రస్థాయిలో నిర్వహణ లోపాలు, గందరగోళం చోటుచేసుకుంటాయని భావించిన వాళ్లకు, ఆ స్థాయిలో సరఫరా చేయగలిగే సామర్థ్యం భారతదేశానికి ఉందా అని తక్కువ అంచనా వేసిన వాళ్లకు కొదవేం లేదు.

తీవ్రమైన ఒత్తిడి వచ్చింది..

2020లో విధించిన నేషనల్‌ లాక్‌డౌన్‌ (lock down), జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత విధించిన లాక్‌డౌన్స్‌కు వచ్చిన స్పందనను బట్టి ప్రజలను విశ్వసనీయ భాగస్వాములుగా (Trusted partners) చేర్చుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు సుస్పష్టంగా అవగతమవుతోంది. ప్రతీ ఒక్కరూ ఇది తమది అని బాధ్యత తీసుకుంటే అసాధ్యమనేదే ఉండదు. వ్యాక్సినేషన్‌ విషయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని చాలా వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది, కాని వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో VIP సంస్కృతికి తావులేకుండా భారత ప్రభుత్వం (Indian government) చూసింది.

2020 నుంచే మార్గదర్శకాలు

మహమ్మారిని వ్యాక్సిన్‌ (vaccine) ద్వారానే ఎదుర్కోవాలనే విషయం మనకు 2020 ప్రారంభంలోనే అర్థమైంది. అప్పటి నుంచి ఏర్పాట్లు మొదలుపెట్టాం. నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి ఏప్రిల్‌ 2020 నుంచే మార్గదర్శకాలు రూపొందించాం. నేటికి కూడా వేళ్ల మీద లెక్క పెట్టగలిగే సంఖ్యలోనే దేశాలు సొంత టీకా అభివృద్ధి చేశాయి. అతి పరిమితంగా ఉన్న ఉత్పత్తిదారులపైనే 180కి పైగా దేశాలు ఆధారపడ్డాయి. ఇప్పటికి పదుల సంఖ్యలో దేశాలు వ్యాక్సిన్‌ సరఫరా (vaccine transport) కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి.

వ్యాక్సిన్​ అభివృద్ధి చేయకపోతే..

భారత్‌ సొంతంగా వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయనట్టు అయితే  (If not developed)పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. ఇంత భారీ సంఖ్యలో ఉండే జనాభాకు వ్యాక్సిన్లు ఎలా సమకూర్చగలిగేది ? దాని కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చేది? అవసరానికి తగినట్టుగా స్పందించిన మన భారతీయ శాస్త్రవేత్తలు (Indian scientists), మన పారిశ్రామికవేత్తలకు మనం రుణపడి ఉండాలి. వారి నైపుణ్యం, కఠోర శ్రమ కారణంగా నేడు వ్యాక్సిన్లపరంగా భారతదేశం స్వావలంబన రాజ్యంగా నిలబడింది. మన భారీ జనాభా డిమాండుకు తగినట్టుగా ఉత్పత్తిని పెంచిన తమకు తిరుగులేదని నిరూపించారు మన వ్యాక్సిన్‌ తయారీదారులు.

పురోగతికి సంధానకర్త..

ఈ పురోగతికి సంధానకర్తగా, తోడ్పాటు అందించే శక్తిగా భారత ప్రభుత్వం నిలిచింది. వ్యాక్సిన్‌ తయారీదారులతో తొలి రోజు నుంచే మమేకమై వారికి కావాల్సిన సంస్థాగత సహకారం, శాస్త్రీయ పరిశోధన (scientific research), ఫలితాలు అందించడంతో పాటు అవసరమైన నియంత్రణ ప్రక్రియలను వేగవంతం చేసింది. సంపూర్ణ ప్రభుత్వంగా వ్యవహరించి అన్ని మంత్రిత్వశాఖలు కలిసికట్టుగా ఒక్కతాటిపైకి వచ్చి అడ్డంకులన్నింటినీ తొలగించడంలో చొరవ తీసుకున్నాయి.

రైళ్లు, విమానాలు వేల సంఖ్యలో..

భారత్‌ వంటి పెద్ద దేశంలో కేవలం ఉత్పత్తి ఒక్కటే సరిపోదు. చివరి మైలు వరకు ఎటువంటి అవాంతరాలు లేకుండా అందించడం కూడా అంతే ప్రధానం. ఒక బాటిల్‌ వ్యాక్సిన్‌ (bottle vaccine) ప్రయాణించేందుకు ఎన్ని సవాళ్లు ఎదుర్కొవాలో అర్థం చేసుకోవాలి. పుణే లేదా హైదరాబాద్‌ (Hyderabad)లో తయారైన వ్యాక్సిన్లను ప్రతీ రాష్ట్రంలోని ఒక కేంద్ర స్థానానికి పంపించడం జరిగింది. అక్కడి నుంచి అది జిల్లా కేంద్రానికి రవాణ అవుతుంది. అక్కడి నుంచి అది వ్యాక్సిన్ కేంద్రానికి చేరుతుంది. దీని కోసం రైళ్లు, విమానాలు వేల సంఖ్యలో ప్రయాణం చేశాయి. అంతే కాదు ఈ మొత్తం ప్రయాణంలో ఉష్ణోగ్రతను ఒక నిర్దేశిత శ్రేణిలో ఉండేలా చూసుకోవాలి.

మనమంతా ఒక దేశం..

దీని కోసం 1 లక్ష కోల్డ్‌ చెయిన్‌ (cold chain) పరికరాలు వినియోగించారు. వ్యాక్సిన్ డెలివరీకి సంబంధించి వివరాలు ముందుగానే రాష్ట్రాలకు చేరవేయడం వల్ల తగిన ఏర్పాట్లు ముందుస్తుగానే అవి చేసుకోగలిగాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇది ఒక అనూహ్యమైన కృషిగా చెప్పుకోవాలి. ఈ ప్రయత్నాలన్నింటినీ టెక్నాలజీ వేదిక CoWin సహాయకారిగా నిలిచింది. వ్యాక్సిన్‌ ప్రక్రియ సమానంగా, లెక్కించే రీతిలో, తెలుసుకునే రీతిలో పారదర్శకంగా ఉండేలా చూసింది. ఎక్కడా ఎటువంటి పక్షపాతానికి తావులేకుండా చూసింది. పేద కార్మికుడు మొదటి డోసు తన గ్రామంలో తీసుకుంటే రెండు డోసు పనిచేసే పట్టణంలో తీసుకునే వెసులుబాటుని ఇది కల్పించింది. క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌ కలిగిన సర్టిఫికేట్లు వెరిఫికేషన్‌ సక్రమంగా ఉండేలా చూశాయి. ఇలాంటి ప్రయత్నాలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు.

2015 స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో..

టీమ్‌ ఇండియా కారణంగా భారతదేశం ముందుకు సాగుతోందని 2015 స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో నేను చెప్పాను. ఈ టీమ్ ఇండియా అంటే 130 కోట్ల జనాభాతో కూడిన అతి పెద్ద టీమ్‌. ప్రజాస్వామ్యం అన్నది ప్రజాస్వామ్యానికి అతి బలమైన శక్తి. 130 కోట్ల భారతీయుల భాగస్వామ్యంతో దేశాన్ని మనం నడిపించినట్టు అయితే మన దేశం ప్రతీ సెకనుకు 130 కోట్ల అడుగులు ముందుకు వేస్తుంది. టీమ్ ఇండియా శక్తేంటో మన వ్యాక్సినేషన్ ప్రక్రియ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యం ఏదైనా అందించగలదనే విషయాన్ని మన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొత్తం ప్రపంచానికి చాటి చెప్పింది.
ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మనం సాధించిన విజయం యువతను, ఆవిష్కర్తలను, ప్రభుత్వంలోని వివిధ స్థాయిలను ఉత్తేజితం చేసి ప్రజాసేవలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పేలా చేయాలి. అది కేవలం మన దేశానికే కాదు యావత్తు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి.
Published by:Prabhakar Vaddi
First published: