Varanasi, UP | PM Narendra Modi sends 100 pairs of jute footwear for the workers at 'Kashi Vishwanath Dham' after finding out that most of them worked bare-footed because it is forbidden to wear leather or rubber footwear in the temple premises: GoI sources pic.twitter.com/BawTJQHYUP
ఇటీవల ఆలయ ప్రాంగణంలో సిబ్బంది చెప్పులు ధరించకుండా విధులు నిర్వహించడాన్ని మోదీ గమనించారు. ఈ సమస్యకు పరిష్కారంగా జూట్ పాదరక్షలను అందించాలని నిర్ణయం తీసుకొన్నారు. వెంటనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని ఏఎన్ఐ ఉత్తరాఖండ్ ట్వీట్టర్ వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం ప్రధాని మోదీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆయన ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్‌లో చాలా సార్లు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఎస్డీఎఫ్ పేరుతో కొత్త రూల్!
వారణాసి (Varanasi) లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) డిసెంబర్ 13, 2021న ప్రారంభించారు. ప్రపంచ పురాతన నగరాల్లో ఒక్కటైన వారణాసిలో పర్యాటక రంగాన్ని మెరుగుపరుస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రత్యేకతలు..
- ఆలయం యొక్క ప్రస్తుత నిర్మాణాన్ని 1780లో మహారాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. 19వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ దీనిని బంగారు 'శిఖర్'తో పట్టాభిషేకం చేశారు.
- ఈ ప్రాజెక్ట్‌లో ఆలయం చుట్టూ ఉన్న 300 కంటే ఎక్కువ ఆస్తులను కొనుగోలు చేశారు.
- ప్రాజెక్టు మొదటి దశలో మొత్తం 23 భవనాలను ప్రారంభించనున్నారు. యాత్రికుల కోసం యాత్రికులకు వివిధ సౌకర్యాలు కల్పిస్తారు, వాటిలో ‘యాత్రి సువిధ కేంద్రాలు’, టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, వేద కేంద్రం, ముముక్షు భవన్, సిటీ మ్యూజియం (City Museum) , వ్యూయింగ్ గ్యాలరీ, ఫుడ్ కోర్ట్ తదితరాలు ఉంటాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.